అక్షయ్‌ ‘గోర్ఖా’
close
Published : 18/10/2021 01:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అక్షయ్‌ ‘గోర్ఖా’

అక్షయ్‌ కుమార్‌ మరో కొత్త చిత్రాన్ని ప్రకటించారు. సంజయ్‌ పూరన్‌ సింగ్‌ తెరకెక్కిస్తున్న ఈ సినిమాకి ‘గోర్ఖా’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను ఇటీవల విడుదల చేశారు. భారత మాజీ ఆర్మీ అధికారి మేజర్‌ జనరల్‌ ఇయాన్‌ కార్డొజొ జీవిత కథతో రూపొందుతోన్న చిత్రమిది. ఇయాన్‌ పాత్రను అక్షయ్‌ పోషిస్తున్నారు. 1971 ఇండో పాక్‌ యుద్ధంలో కీలక పాత్ర పోషించారు ఇయాన్‌ కార్డొజొ. గోర్ఖా బెటాలియన్లో పని చేసిన ఇయాన్‌.. ఆ యుద్ధంలో ఓ లాండ్‌మైన్‌పై కాలు వేయడం వల్ల కాలు ఛిద్రమైంది. ఆ సమయంలో వైద్య సహాయం దొరికే అవకాశం లేకపోవడంతో... తన దగ్గరున్న ఖుక్రీ (కత్తి)తో తన కాలును తనే కోసేసుకున్నారు. అంతటి వీరుడి పాత్రను ఇప్పుడు తాను పోషిస్తుండటం పట్ల అక్షయ్‌ ట్విటర్‌ వేదికగా సంతోషం వ్యక్తం చేశారు. అయితే ఫస్ట్‌లుక్‌లో చూపించిన ఖుక్రీ.. అసలు ఖుక్రీలా లేదని ఓ నెటిజన్‌ అక్షయ్‌కు ట్వీట్‌ చేశాడు. నిజమైన ఖుక్రీ ఎలా ఉంటుందో చూపిస్తూ.. దానికి సంబంధించిన ఫొటోలు నెట్టింట పోస్ట్‌ చేశాడు. దీనిపై వెంటనే స్పందించిన అక్షయ్‌ కుమార్‌.. తప్పు జరిగినందుకు క్షమాపణ చెప్పారు. మరోసారి ఇలాంటి పొరపాట్లు  జరకుండా చూసుకుంటామని, ఇంకేవైనా విలువైన సలహాలుంటే చెప్పమని, కచ్చితంగా స్వీకరిస్తామని అన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని