రెట్టింపు యాక్షన్‌.. వినోదం
close
Published : 23/10/2021 04:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రెట్టింపు యాక్షన్‌.. వినోదం

జాన్‌ అబ్రహం కథానాయకుడిగా తెరకెక్కి విజయం సాధించిన చిత్రం ‘సత్యమేవ జయతే’. ఇప్పుడు ఈ చిత్రానికి కొనసాగింపుగా ‘సత్యమేవ జయతే 2’ తెరకెక్కిన సంగతి తెలిసిందే. కొన్ని నెలలుగా విడుదల కోసం ఎదురుచూస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు వచ్చే నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని జాన్‌ అబ్రహం ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. ‘‘రెట్టింపు యాక్షన్‌, వినోదం మళ్లీ నవంబరు 25న థియేటర్లకు రానుంది. ట్రైలర్‌ ఈ నెల 25న విడుదల కానుంది’’ అని ట్వీట్‌ చేశారు. మిలాప్‌ జవేరీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దివ్యా కోస్లా కూమార్‌ ఓ కీలక పాత్రలో నటించింది.


Advertisement

Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని