చార్లీ చాప్లిన్‌ గెటప్‌తో వస్తే సినిమా ఫ్రీ!
close
Published : 02/01/2020 17:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చార్లీ చాప్లిన్‌ గెటప్‌తో వస్తే సినిమా ఫ్రీ!

ఇంటర్నెట్‌డెస్క్‌: వెండితెరపై ఆయనేమీ భారీ డైలాగ్‌లు చెప్పలేదు. సిక్స్‌ ప్యాక్‌ బాడీతో రౌడీలను ఇరగదీయనూలేదు. అదిరిపోయే డ్యాన్సులు చేయలేదు. ఆయన చేసింది కేవలం తన హావభావాలతో, చిలిపి చేష్టలతో ప్రేక్షకులకు కితకితలు పెట్టి కడుపుబ్బా నవ్వించడమే. తలపై టోపీ, చేతిలో కర్ర, చిన్న మీసం ఇవి చాలు ఆయనెవరో ఇట్టే చెప్పేస్తారు. యావత్‌ ప్రపంచాన్ని తన నటనతో కట్టిపడేసిన హాస్యనటుడు చార్లీచాప్లిన్‌. ఆయన ప్రతి చిత్రమూ ఒక అజరామరమే.

చార్లీ చాప్లిన్‌ తీసిన ‘ది ఐడిల్‌ క్లాస్‌’ 1921లో విడుదలయింది. అప్పటికే చాప్లిన్‌ విశ్వవిఖ్యాతి పొందారు. ఈ సినిమా అమెరికాలోని వాషింగ్టన్‌కు సమీపంలో ఉన్న బెల్లింగామ్‌ అనే ఊళ్లో లిబర్టీ థియేటర్లో విడుదలయింది. ఆ థియేటర్‌ యజమాని ఒక నూతనమైన పద్ధతి ప్రవేశపెట్టాడు. అంతకు ముందొచ్చిన చాప్లిన్‌ చిత్రం ‘ది ట్రాంప్‌’ లోని చాప్లిన్‌ గెటప్‌తో ఎంతమంది వస్తే, అంతమందికీ ఉచితంగా ‘ఐడిల్‌ క్లాస్‌’ చూపిస్తానన్నాడు. టోపీ, కోటు, చేతికర్ర, మీసం పెట్టుకుని వందలమంది చిన్నా, పెద్దా చాప్లిన్‌ వేషం వేసుకుని వచ్చారు! ఆ దృశ్యం గొప్ప వేడుకను తలపించిందట. అప్పట్లో ‘స్పాన్‌’ పత్రిక ఆ ఫొటోని ప్రచురించింది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని