మహేశ్‌ సినిమాకు తమన్‌ సంగీతం..!
close
Published : 20/01/2020 22:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మహేశ్‌ సినిమాకు తమన్‌ సంగీతం..!

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘సరిలేరు నీకెవ్వరు’తో సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు, ‘అలవైకుంఠపురములో’తో సంగీత దర్శకుడు తమన్‌ హిట్లు కొట్టి మంచి జోష్‌ మీదున్నారు. ఇదిలా ఉండగా మహేశ్‌బాబు ఇప్పటికే తన 27వ సినిమా కోసం సిద్ధమయ్యాడు. దర్శకుడు వంశీ పైడిపల్లితో కలిసి తన తర్వాతి సినిమా చేయనున్నాడు. అయితే, ఈ సినిమాకు సంగీత దర్శకుడు ఎవరనేది ఇప్పటి వరకూ ఖరారు కాలేదు. అయితే, మహేశ్‌ తరువాతి సినిమాకు తమన్‌ సంగీతం అందించనున్నట్లు తెలుస్తోంది. అల వైకుంఠపురములో చిత్రానికి తమన్‌ సమకూర్చిన సంగీతం అభిమానులను బాగా ఆకట్టుకుంది. దీంతో హీరో మహేశ్‌బాబు, దర్శకుడు వంశీ పైడిపల్లి.. తమన్‌ వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. తమన్‌ ఇంతకు ముందు ‘బిజినెస్‌మ్యాన్‌’ సినిమాకు సంగీతం అందించారు. ఆ సినిమాలోని ‘సారొస్తారా.’. ‘బ్యాడ్ బాయ్స్‌’ వంటి పాటలు అభిమానులను ఆకట్టుకున్నాయి. మహేశ్‌, వంశీ కాంబినేషన్‌లో వచ్చిన ‘మహర్షి’ బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కావడంతో రానున్న ఈ సినిమాపై ఇప్పటి నుంచే అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే, ఈ సినిమాకు సంబంధించి ఇంతవరకూ అధికారిక ప్రకటన వెలువడలేదు. వచ్చే ఏడాదికల్లా చిత్రీకరణ పూర్తి చేసి అభిమానులకు మరో సంక్రాంతి కానుక ఇవ్వాలని మహేశ్‌బాబు యోచిస్తున్నట్లు తెలుస్తోంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని