లైట్ల బకాయితో మూతబడిన స్టూడియో
close
Published : 03/02/2020 15:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

లైట్ల బకాయితో మూతబడిన స్టూడియో

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆంధ్రప్రదేశ్‌లో మొదటి స్టూడియో రాజమండ్రిలో వెలసిందనేది చరిత్ర. 1936లో ‘సంపూర్ణ రామాయణం’ తీశారు. స్టూడియో పేరు, కంపెనీ పేరు ఒకటే. దుర్గా సినీ టోన్‌. ఒక్క చిత్రంతోనే నిర్మాణం ఆగిపోయింది. ఆ సామాగ్రిని బొబ్బలి రాజావారు, చిక్కవరం జమిందారూ తీసుకుని ఆంధ్ర సినీటోన్‌ పేరుతో విశాఖపట్నంలో స్టూడియో ఏర్పాటు చేశారు. ఆ స్టూడియోలో ‘మోహిని భస్మాసుర(1938), భక్త జయ్‌దేవ్‌(1938), పాశుపతాస్త్ర మూడు సినిమాలు నిర్మించారు.

‘భక్త జయ్‌దేవ్‌’ని హిరేన్‌బోస్‌ డైరక్ట్‌ చేశారు. ‘మోహినీ భస్మాసుర’ను సి.పుల్లయ్య తెరకెక్కించారు. ఇక ‘పాశుపతాస్త్ర’కు కొచ్చెర్లకోట రంగారావు దర్శకత్వం వహించారు. ఈ సినిమాల కోసం స్టూడియోకి కావాల్సిన లైట్లు ఓ కంపెనీ నుంచి అద్దెకు తెచ్చారు. పై మూడు చిత్రాల తర్వాత, ఇంకో పౌరాణికం ఆరంభమై షూటింగ్‌ దశలో ఉంది. అయితే, లైట్లు ఇచ్చిన కంపెనీకి చెల్లించాల్సిన డబ్బును కట్టాల్సిందని, ఎన్నిసార్లు హెచ్చరికలు పంపినా స్టూడియోవారు పట్టించుకోలేదు. దీంతో ఆ కంపెనీ వాళ్లు అకస్మాత్తుగా స్టూడియోలో ప్రవేశించి, వెలుగుతున్న దీపాల్ని పట్టుకుపోయారట. షూటింగ్‌ ఆగిపోయింది. ఆ తర్వాత కొత్త లైట్లను తీసుకొచ్చే ప్రయత్నం కానీ, బకాయిలు చెల్లించి తీసుకెళ్లిన లైట్లను తిరిగి తీసుకురావడం కానీ చేయలేదు. దాంతో షూటింగ్‌లు లేక స్టూడియో కూడా మూతపడింది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని