75ఏళ్ల క్రితమే ఆయన చెప్పారు!
close
Published : 20/03/2020 15:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

75ఏళ్ల క్రితమే ఆయన చెప్పారు!

ఇంటర్నెట్‌డెస్క్‌: ఒకప్పుడు నెల జీతంపై నటించిన హీరోలు, హీరోయిన్లు, క్యారెక్టర్‌ ఆర్టిస్టులు ఆ తర్వాతి కాలంలో రోజుల లెక్కన పనిచేశారు. ఇప్పుడు కథానాయకులైతే కోట్లలో, హీరోయిన్లు, మిగిలిన నటులు లక్షల్లో పారితోషికాలు తీసుకుంటున్నారు. సినిమా హిట్టయితే పర్వాలేదు. కానీ, ఫ్లాప్‌ అయితే మాత్రం నిర్మాత భారీగా నష్టపోతున్నాడు. నటులు తమ పారితోషికం తగ్గించుకుంటే నిర్మాత బాగుపడతాడనని 40వ దశకంలోనే పలువురు నిర్మాతలు అభిప్రాయపడ్డారు.

గూడవల్లి రామబ్రహ్మం 1940లో ‘ఇల్లాలు’ తీశారు. కాంచనమాల హీరోయిన్‌. అప్పట్లో ఆయన దక్షిణ భారత చలనచిత్ర మండలికి అధ్యక్షులు. 70 ఏళ్ల క్రితమే ఆయన చలన చిత్రమండలి సమావేశంలో మాట్లాడుతూ ‘‘సినిమా నిర్మాణ వ్యయం ఎక్కువవుతోంది. నటీనటుల పారితోషికాలు చుక్కలంటుతున్నాయి. వాళ్లు బాగా తగ్గించుకోకపోతే, నిర్మాణం చెయ్యలేం. ‘ఇల్లాలు’లో ఎక్కువ పారితోషికాన్ని నేను కాంచనమాలకి ఇవ్వవలసి వచ్చింది. ముఖ్య తారలు సహకరించకపోతే, చిత్ర నిర్మాణం అసాధ్యం’’ అన్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని