‘వర్మకు ఆడవాళ్ల పిచ్చి అట కదా’ అని నన్ను అడిగేవారు!
close
Updated : 06/04/2020 15:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘వర్మకు ఆడవాళ్ల పిచ్చి అట కదా’ అని నన్ను అడిగేవారు!

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘కలర్స్‌’ కార్యక్రమంతో బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చి అందరికీ చేరువైన నటి స్వాతి. ఆ తర్వాత తెలుగు, తమిళ, మ‌ల‌యాళ‌ భాషల్లో సినిమాలు చేస్తూ కథానాయికగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ‘అష్టాచమ్మా’, ‘స్వామిరారా’, ‘కార్తికేయ’ వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించారు. కేవలం నటిగానే కాకుండా డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా, సింగర్‌గానూ రాణించారు. వివాహనంతరం సినిమాలకు దూరంగా ఉన్నారు. అయితే, అల్లు అర్జున్‌ కథానాయకుడిగా పరిచయమైన ‘గంగోత్రి’ చిత్రం ద్వారా స్వాతి కథానాయికగా వెండితెరకు పరియం కావాల్సి ఉంది. మరి ఆ ఛాన్స్‌ ఎందుకు వదులుకున్నారు? ‘కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం అప్పల్రాజు’ చిత్రం కోసం వర్మతో పనిచేయటంపై కూడా స్వాతి ఓ సందర్భంలో పంచుకున్నారు. 

‘‘అవును ‘గంగోత్రి’ చిత్రంలో కథానాయికగా చేయమని అడిగారు.  అప్పుడు ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ అయి, ఎంబీబీఎస్‌ ఫ్రీ సీటు వచ్చింది. టీవీ షో కూడా ఆపేసి చదువుపై దృష్టి పెట్టాలని అనుకున్నా. అందుకే సినిమా వద్దనుకున్నా. కానీ టీవీ షో వల్ల మెడికల్‌ కాలేజ్‌లో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నా. చివరకు హాస్టల్‌ నుంచి బయటకు వచ్చేశా. ఫస్ట్‌ ఇయర్‌ హాలిడేస్‌లో ‘డేంజర్‌’ ఆఫర్‌ వచ్చింది. రెండో సంవత్సరం సెలవుల్లో ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’, మూడో సంవత్సరం సెలవుల్లో ‘అష్టాచమ్మా’ చేశా’’ అని చెప్పుకొచ్చారు. 

ఇక తాను వర్మతో పనిచేయడం గురించి మాట్లాడుతూ.. ‘‘ఆయనతో చాలా మంచి వర్కింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌. చాలామంది బయటవాళ్లు నన్ను కలిసినప్పుడు ‘రామ్‌గోపాల్‌ వర్మకు ఆడవాళ్లంటే పిచ్చి అటకదా! నిన్ను తినేశారా? వల్గర్‌ మెసేజ్‌లు వచ్చాయా?’ అంటూ మొహమాటం లేకుండా అడిగేవారు. రామ్‌గోపాల్‌వర్మ నన్నెప్పుడూ ఇబ్బంది పెట్టలేదు. ఒక్కసారి కూడా ఎక్స్‌ట్రా డైలాగులు లేవు. పైగా ‘స్వాతి నువ్వు చాలా టాలెంటెడ్‌ గర్ల్‌. నిన్ను చూస్తే రేవతిగారు గుర్తొస్తారు. మీరిద్దరూ ఎక్కువ ఆలోచిస్తారు. అలా ఆలోచించవద్దు. చేసుకుంటూ వెళ్లిపో’ అని మాత్రమే సలహా ఇచ్చారు. అది తప్ప ఆయన తన గీతనెప్పుడూ దాటలేదు’’ అంటూ వర్మకు కితాబిచ్చారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని