ఉద‌యం రెండు ఇడ్లీ త‌న సొంత ఖ‌ర్చుతో...
close
Published : 07/05/2020 18:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఉద‌యం రెండు ఇడ్లీ త‌న సొంత ఖ‌ర్చుతో...

ఇంట‌ర్నెట్‌డెస్క్: తెలుగు చిత్ర సీమ‌లో ఎవ‌ర్‌గ్రీన్ న‌టుడు ఎవ‌రంటే అక్కినేని నాగేశ్వ‌ర‌రావు పేరు క‌చ్చితంగా చెప్పాల్సిందే. ఇక క్ర‌మ‌శిక్ష‌ణ విష‌యంలో ఆయ‌న త‌ర్వాతే. షూటింగ్‌ల స‌మ‌యంలో నిర్మాత‌ల‌కు ఇబ్బంది క‌లిగించ‌కుండా త‌న ఏర్పాట్లు తాను చేసుకునేవారు. అంతేకాదు, ఆరోగ్యం విష‌యంలోనూ ఎంతో శ్ర‌ద్ధ తీసుకునేవారు.

అవుట్‌డోర్ షూటింగ్ మ‌న‌ దేశంలోగానీ, విదేశాల్లోగానీ పెట్టుకుంటే ఆ ఖ‌ర్చుల‌న్నీ నిర్మాతే భ‌రించాలి. భోజ‌న వ‌స‌తుల‌న్నీ వాళ్లే ఏర్పాటు చేస్తారు. ఇది ఆనాటి నుంచి ఉన్న విధానం. కొల్హాపూర్‌, కోల్‌క‌తాల్లో తెలుగు సినిమాలు తీసిన‌ప్పుడు హోట‌ల్స్ కాకుండా, పెద్ద ఇళ్లు తీసుకొని అక్క‌డే న‌టీన‌టుల్ని ఇత‌ర బృందాన్ని ఉంచేవారు. తెలుగు వంట‌లు చేసే వంట వాళ్ల‌ని తీసుకెళ్లి అక్క‌డే వంట‌లు చేయించే వారు.

అక్కినేని వారు హైదరాబాద్‌కి మారిన త‌ర్వాత‌, జ‌రిగిన షూటింగ్‌ల‌కి ఇక్క‌డి నుంచే మ‌ద్రాసు వెళ్లేవారు. అక్క‌డ స‌వేరా హోట‌ల్లో ఉండేవారు. స‌వేరా య‌జ‌మాని నాగేశ్వ‌ర‌రావుకు అభిమాని, మిత్రుడు. అందుకే హోట‌లు గ‌దికి బాగా రాయితీ ఇచ్చేవారు. ఆయ‌న నిర్మాత‌కీ అంతే. అందువ‌ల్ల నిర్మాత‌కి బాగా క‌లిసి వ‌చ్చేది. భోజ‌నం అప్ప‌ట్లో ఆయ‌న‌కి జ‌గ‌ప‌తి ఫిల్స్మ్ రాజేంద్ర‌ప్ర‌సాద్ ఇంటి నుంచి వెళ్లేది. స‌ఫోలా నూనెతో చేసిన వంట‌లే తినేవారు. ఆ ఏర్పాటంతా రాజేంద్ర‌ప్ర‌సాద్ చేసేవారు. ఉద‌యం రెండు ఇడ్లీ మాత్రం హోట‌ల్‌లో తినేవారు. అదీ త‌న‌ ఖ‌ర్చుతో. మిత్రులు వ‌స్తే, కాఫీ టిఫిన్లు తెప్పించినా, ఆ బిల్లు అక్కినేని వారే క‌ట్టేవారు గానీ, నిర్మాత మీద‌కి నెట్టేవారు కాదు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని