శోభన్‌బాబు చెప్పిందే జరిగింది!
close
Updated : 05/06/2020 16:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

శోభన్‌బాబు చెప్పిందే జరిగింది!

ఇంటర్నెట్‌డెస్క్‌: తన నటనతోనే కాదు, అందంతోనూ ఆనాటి అమ్మాయిల హృదయాలను దోచిన నటుడు శోభన్‌బాబు. అందుకే ఆయన్ను అందరూ ‘సోగ్గాడు’ అని పిలుస్తుంటారు. వంద‌ల చిత్రాలు చేసిన అనుభ‌వం ఆయన సొంతం. ఎంతోమంది న‌టులు శోభన్‌బాబు సినిమాల‌తోనే ప‌రిచ‌య‌మ‌య్యారు. ఎవ‌రిలో ఎలాంటి ప్ర‌తిభ దాగుందో ఆయ‌న ప‌సిగ‌ట్ట‌కుండా ఎలా ఉంటారు? అనేక భాష‌ల్లో న‌టించి మంచి న‌టుడిగా గుర్తింపు తెచ్చుకున్న ప‌్ర‌కాష్‌రాజ్ గురించి అప్ప‌ట్లోనే శోభ‌న్‌బాబు ఓ మాట చెప్పార‌ట‌. ఈ విషయాన్ని ప్ర‌కాష్‌రాజ్ ఓ సందర్భంలో పంచుకున్నారు.. శోభ‌న్‌బాబు చెప్పింది చెప్పిన‌ట్టుగానే తన జీవితంలో జ‌రిగిందంటూ ఆ మాట‌ల్ని గుర్తు చేసుకొన్నారు.

‘‘శోభ‌న్‌బాబు నేనూ.. ‘దొర‌బాబు’ చిత్రంలో న‌టించాం. అప్పుడ‌ప్పుడే ప‌రిశ్ర‌మ‌లోకి అడుగుపెట్టిన‌వాణ్ని దాంతో ఉత్సాహంగా క‌నిపించేవాణ్ని. యాక్ష‌న్ స‌న్నివేశాల్లో నా ఆవేశం చూసి ‘ప్ర‌కాష్... న‌ట‌నే క‌దా, ఎందుకంత తొంద‌ర‌, కాస్త నిదానం’ అన్నారు. అలాగే ఒక రోజు ఆయ‌న న‌న్ను ద‌గ్గ‌రికి పిలిచి ‘ప్ర‌కాష్ నువ్వు రెండేళ్ల త‌ర్వాత న‌న్ను మ‌ళ్లీ క‌లువు’ అన్నారు. ‘రెండేళ్ల త‌ర్వాత క‌ల‌వ‌మ‌ని ప్ర‌త్యేకంగా చెప్ప‌డ‌మేంటి గురువుగారూ, త‌ప్ప‌కుండా క‌లుస్తా’ అని చెప్పా. ఆయ‌నప్పుడు ‘నువ్వు క‌ల‌వ‌లేవు, ఎందుకంటే అప్పుడు బిజీ ఆర్టిస్టువి అయ్యుంటావు’’ అని చెప్పారు.

‘‘ఆయ‌న చెప్పిన‌ట్టుగానే రెండేళ్ల త‌ర్వాత నేను చాలా బిజీ అయిపోయాను. ఉన్న‌ట్టుండి ఒక రోజు ఆయ‌న ఎదురైన‌ప్పుడు ‘గురువుగారూ, మీరు చెప్పిందే నిజ‌మైంది, మిమ్మ‌ల్ని క‌ల‌వ‌లేక‌పోయాను. అంత బిజీగా ఉన్నా’ అని చెప్పా. ‘నీలో విద్వ‌త్తుని చూసే ఆ రోజు ఆ మాట చెప్పా. నీకు మ‌రింత భ‌విష్య‌త్తు ఉంది. మ‌రింత ఎత్తుకు ఎదుగుతావు’ అని ఆయ‌న చెప్పి వెళ్లిపోయారు. ఆ ఆశీర్వాదంతోనే ఇంత దూరం వ‌చ్చా’’ అంటూ శోభ‌న్‌బాబుతో త‌న‌కున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు ప్రకాష్‌రాజ్‌.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని