కొన్నాళ్లు పోయాక ..ఎలాగూ తప్పదు కదా!
close
Published : 11/06/2020 13:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కొన్నాళ్లు పోయాక ..ఎలాగూ తప్పదు కదా!

ఇంటర్నెట్‌డెస్క్‌: శివాజీ గణేశన్‌ హీరోగా జెమినీ సంస్థ తమిళంలో నిర్మించిన ‘మోటార్‌ సుందరం పిళ్ళై’ బాగా ఆడింది. ఆ చిత్రాన్ని ఏయన్నార్‌తో తెలుగులో నిర్మించాలని ‘మధు పిక్చర్స్‌’ నిర్మాత పి.మల్లికార్జునరావు అనుకున్నారు. నడి వయసులో పిల్లల తండ్రి పాత్రలో తనను చూసేందుకు అభిమానులు అంగీకరించరంటూ ఏయన్నార్‌ వద్దన్నారట. అప్పుడు ఓ రోజు జెమినీ అధినేత ఎస్‌.ఎస్‌.వాసన్‌ ‘మిమ్మల్ని కలవడానికి వస్తున్నాను’ అంటూ నాగేశ్వరరావుకు ఫోన్‌ చేశారట. 

‘మీరు పెద్దవారు. నా వద్దకు రావడమేమిటి? నేనే వస్తాను’ అంటూ ఏయన్నార్‌ చెబుతున్నా వాసన్‌ పనిగట్టుకుని వచ్చారట. వచ్చి, ‘ఈ సినిమా నా బిడ్డలాంటిది. ఇదంటే నాకెంతో ఇష్టం. ఈ పాత్రలో గ్లామర్‌ లేదని మీరు భావించవద్దు. కొన్నాళ్ళు పోయాక వయసు మళ్ళిన పాత్రలు ఎలాగూ వేయక తప్పదు. ఇప్పుడు మీరు నటిస్తేనే ఈ పాత్రకు నిండుదనం వస్తుంది’ అంటూ ఏయన్నార్‌ని ఒప్పించారట. ఫలితంగా ‘మంచి కుటుంబం’ రూపొందింది. వాసన్‌ ఊహించినట్లుగానే ప్రేక్షకాదరణ పొందింది. తెలుగు వెర్షన్‌కు తాను నిర్మాత కాకపోయినా తనకెంతో ఇష్టమైన చిత్రం అన్ని భాషలలోనూ బాగా ఆడాలని భావించే వాసన్‌ లాంటి వారు ఎంతమంది ఉంటారు?మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని