బాబోయ్‌.. విజయ్‌ దేవరకొండ ఎంట్రీ అదుర్స్‌
close
Updated : 03/01/2020 12:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బాబోయ్‌.. విజయ్‌ దేవరకొండ ఎంట్రీ అదుర్స్‌

అభిమానుల హంగామా.. రష్మిక షాక్

హైదరాబాద్‌: ‘మార్కెట్లో వాడి ఫాలోయింగ్‌ చూస్తుంటే పిచ్చెక్కుతోంది..’ అని ఓ సినిమాలో హీరోని ఉద్దేశిస్తూ విలన్‌ చెప్పే డైలాగ్‌ ప్రస్తుతం టాలీవుడ్‌లో ఓ యువ కథానాయకుడికి సరిపోతోంది. ఇంతకీ ఆ హీరో ఎవరంటే.. విజయ్‌ దేవరకొండ. ‘అర్జున్‌ రెడ్డి’తో అటు మాస్‌ అభిమానులను.. ‘గీత గోవిందం’తో ఇటు క్లాస్‌ అభిమానులను ఆయన సొంతం చేసుకున్నారు. దీంతో ఈ ‘రౌడీ’ ఎక్కడైనా కనిపిస్తే చాలు అభిమానులు చేసే హంగామా అంతా ఇంతా కాదు. అయితే ఇది కేవలం తెలుగు రాష్ట్రాలకు మాత్రమే పరిమితం కాలేదు. తాజాగా ఆయన ఓ అవార్డుల కార్యక్రమానికి చెన్నై వెళ్లారు. అవార్డుల ప్రదానోత్సవంలో భాగంగా ఆయన వేదిక వద్దకు ఎంట్రీ ఇవ్వగానే అభిమానులు పెద్ద ఎత్తున సందడి చేశారు. అభిమానులు చేసిన గోలతో అక్కడే ఉన్న రష్మిక సైతం షాక్‌కు గురయ్యారు.

ఇదిలా ఉండగా అవార్డుల ప్రదానోత్సవానాకి ముందు విజయ్‌ దేవరకొండ మాట్లాడుతూ తాను రష్మికలాగా తమిళ్‌ చక్కగా మాట్లాడలేనని, ఎదో కొంచెం కొంచెం మాత్రమే మాట్లాడగలనని తెలిపారు. అనంతరం విలేకరి కోలీవుడ్‌లోని ఏ హీరోతో నటించాలనుకుంటున్నారు అని ప్రశ్నించగా.. ‘ధనుష్‌ అంటే నాకు ఇష్టం. ఆయన నటించిన ఎన్నో చిత్రాలు చూశాను. సూర్య, కార్తిలతో నటించడానికి ఇష్టపడతాను. ఎందుకంటే రజనీ సర్‌, అజిత్‌, విజయ్‌ లాంటి పెద్ద స్టార్స్‌ సినిమాల్లో మనకు నటించడానికి చిన్న పాత్ర మాత్రమే ఉంటుంది. అలా నాకు నటించడం ఇష్టం ఉండదు.’ అని తెలిపారు. అంతేకాకుండా లిప్‌లాక్‌ సన్నివేశాల గురించి మాట్లాడుతూ.. ‘నిజం చెప్పాలంటే అందరి ముందు లిప్‌లాక్‌ సన్నివేశాల్లో నటించడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ ఒక నటుడిగా అలాంటి సన్నివేశాల్లో నటించక తప్పదు. ఎందుకంటే అది మా వృత్తి.’ అని విజయ్‌ దేవరకొండ వివరించారు.

 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని