పూజా.. ప్రభాస్‌ ప్రపోజ్‌ చేస్తే ఏం చేస్తారు?
close
Updated : 03/01/2020 22:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పూజా.. ప్రభాస్‌ ప్రపోజ్‌ చేస్తే ఏం చేస్తారు?

హైదరాబాద్‌: రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ మీకు ప్రపోజ్‌ చేస్తే ఏం చేస్తారు..? ఓ ఫ్యాన్‌ ముద్దుగుమ్మ పూజా హెగ్డేను అడిగిన ప్రశ్న ఇది. అయితే దీనికి సమాధానం చెప్పడానికి ఆమె నిరాకరించారు. ‘ఇదేం ప్రశ్న.. సినిమాలో ఆయన నాకు ప్రపోజ్‌ చేయొచ్చేమో. కానీ.. ఈ ప్రశ్నకు జవాబు చెప్పాలని నాకు లేదు’ అని పూజా పేర్కొన్నారు. అనంతరం మహేశ్‌బాబుతో కలిసి ‘మహర్షి’ సినిమా కోసం పనిచేయడం ఎలా ఉందని, ఆయనతో కలిసి మరోసారి నటిస్తారా? అని ప్రశ్నించగా.. ‘త్వరలోనే అది జరుగుతుందని ఆశిస్తున్నా. మహేశ్‌ ఓ గొప్ప స్టార్‌. ఆయన దగ్గర చాలా నేర్చుకోవచ్చు. ఆయన్నుంచి వాయిస్‌ మాడ్యులేషన్ విషయంలో చాలా మెలకువలు తెలుసుకున్నా. ఆయన డైలాగ్‌ డెలివరీ పర్‌ఫెక్ట్‌ పాయింట్‌ దగ్గర ఉంటుంది’ అని బ్యూటీ చెప్పారు.

పూజా, ప్రభాస్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. రాధాకృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ వారంలో అన్నపూర్ణ స్టూడియోలో సినిమా తర్వాతి షెడ్యూల్‌ ప్రారంభం కాబోతోందట. ఈ చిత్రానికి ‘జాన్‌’ అనే టైటిల్‌ పరిశీలనలో ఉంది. మరోపక్క అల్లు అర్జున్‌, పూజా జంటగా నటించిన ‘అల వైకుంఠపురములో..’ సినిమా సంక్రాంతి విడుదలకు సిద్ధమవుతోంది.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని