అలీ కొత్త అవతారం..!
close
Published : 04/01/2020 22:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అలీ కొత్త అవతారం..!

హైదరాబాద్‌: ప్రముఖ హాస్య నటుడిగా, వ్యాఖ్యాతగా ప్రేక్షకుల్ని అలరిస్తున్న అలీ సరికొత్త అవతారం ఎత్తారు. ‘అలీవుడ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌’ పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించారు. దీనికి సంబంధించిన లోగోను శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అలీ ఆవిష్కరించారు. ఈ సమావేశంలో సినీ ప్రముఖులు ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, జయచంద్ర, శ్రీలేఖ, రవివర్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అలీ మాట్లాడుతూ.. తన సంస్థ ద్వారా వెబ్ సిరీస్‌లు, టీవీ షోలు, సీరియల్స్, వాణిజ్య చిత్రాల్ని రూపొందిస్తానని తెలిపారు. శ్రీబాబా నేతృత్వంలో క్రియేటివ్ డైరెక్టర్ మనోజ్ హుస్సేన్ ఆధ్వర్యంలో ఈ సంస్థ కార్యకలాపాలు జరుగుతాయన్నారు. రాబోయే రోజుల్లో వెబ్ సీరీస్‌లకు మంచి ఆదరణ లభిస్తుందని అభిప్రాయపడ్డారు. 24 క్రాఫ్ట్‌లకు సంబంధించిన సేవలను తమ సంస్థ ద్వారా అందిస్తామని, తను తీయబోయే వెబ్ సిరీస్‌లు, టీవీ షోలను ఆదరించాలని అలీ కోరారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని