అనిల్‌ రావిపూడికి ఈరోజు చాలా స్పెషల్‌..!
close
Published : 05/01/2020 11:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అనిల్‌ రావిపూడికి ఈరోజు చాలా స్పెషల్‌..!

ఒకపక్క సినిమా.. మరోపక్క ఫ్యామిలీ

హైదరాబాద్‌: టాలీవుడ్‌ దర్శకుడు అనిల్‌ రావిపూడికి ఈ రోజు చాలా స్పెషల్‌. కారణమేమిటంటే ఆయన దర్శకత్వం వహించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుక ఈ రోజు సాయంత్రం జరగనున్న విషయం తెలిసిందే. అయితే ‘సరిలేరు నీకెవ్వరు’ సంబరాన్ని మరింత పెంచే విధంగా ఆయన సతీమణి పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారట. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు ఆయనకు సోషల్‌మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 

మేజర్‌ అజయ్‌ కృష్ణ పాత్రలో మహేశ్‌ నటించిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. అలనాటి తార విజయశాంతి ఈ సినిమాతో టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇచ్చారు. ఇందులో ఆమె ప్రొఫెసర్‌ భారతిగా కనిపించనున్నారు. దిల్‌రాజు, మహేశ్‌బాబు, అనిల్‌ సుంకర నిర్మాతలుగా వ్యవహరించారు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు అందించారు. ఈ సినిమాలో మహేశ్‌కు జంటగా రష్మిక నటించారు. సంక్రాంతి కానుకగా జనవరి 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈరోజు సాయంత్రం నిర్వహించనున్న ప్రీరిలీజ్‌ వేడుకకు మెగాస్టార్‌ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. మరోవైపు ఈ సినిమా ట్రైలర్‌ను రాత్రి 9.09 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్రబృందం పేర్కొంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని