మహేశ్‌ను టార్గెట్‌ చేసిన రష్మిక ఫ్యామిలీ..!
close
Published : 05/01/2020 22:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మహేశ్‌ను టార్గెట్‌ చేసిన రష్మిక ఫ్యామిలీ..!

అనిల్‌ రావిపూడి ఏమన్నారంటే..

హైదరాబాద్‌: టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబును రష్మిక, ఆమె ఫ్యామిలీ టార్గెట్‌ చేశారట. ఈ విషయాన్ని దర్శకుడు అనిల్‌ రావిపూడి తెలిపారు. మహేశ్‌బాబు కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రష్మిక కథానాయిక. సంక్రాంతి కానుకగా జనవరి 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్‌ శరవేగంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా అనిల్‌రావిపూడి విలేకర్లతో సరదాగా ముచ్చటించారు. 

‘ఈ సినిమాలో రైలులో జరిగే ఓ ఎపిసోడ్‌ చాలా ఫన్నీగా ఉండనుంది. ట్రైన్‌ ఎక్కిన దగ్గర నుంచి మహేశ్‌ను రష్మిక, ఆమె కుటుంబం ఎలా టార్గెట్ చేశారు, అందులో వచ్చే ఫన్‌ ప్రేక్షకులను ఆకట్టుకోనుంది. బండ్లగణేశ్‌ ఈ సినిమాలో ఓ దొంగ పాత్రలో కనిపించ నున్నారు. ట్రైన్‌ దోచుకోడానికి వచ్చిన ఓ దొంగగా బండ్ల గణేశ్‌ పాత్ర చాలా ఫన్నీగా ఉంటోంది.’ అని అనిల్‌ రావిపూడి తెలిపారు. అనంతరం బండ్లగణేశ్‌ గురించి అనిల్‌మాట్లాడుతూ.. ‘బండ్ల గణేశ్‌ చాలా మంచి మనిషి. ఆయనతో షూటింగ్‌ చాలా సరదాగా గడిచింది. కొన్నిసార్లు మహేశ్‌ ఆయన్ని సరదాగా ఆటపట్టించేవారు. మహేశ్‌ టీజ్‌ చేస్తుంటే గణేశ్‌ డైలాగులు మర్చిపోయేవారు.’ అని అనిల్‌ రావిపూడి తెలిపారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని