ఇదే నెం:1 సెల్ఫీ: దేవిశ్రీ ప్రసాద్‌
close
Published : 06/01/2020 12:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇదే నెం:1 సెల్ఫీ: దేవిశ్రీ ప్రసాద్‌

హైదరాబాద్‌: ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రీ రిలీజ్‌ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని మరింత విజయవంతం చేసిన మెగాస్టార్‌ చిరంజీవికి.. సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్‌ ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఆయన మెగాస్టార్‌, సూపర్‌స్టార్‌తో కలిసి దిగిన సెల్ఫీని ట్విటర్‌ వేదికగా పోస్ట్‌ చేశారు. ఇదే నెం:1 సెల్ఫీ అని దేవిశ్రీ పేర్కొన్నారు. అంతేకాకుండా ఆదివారం నిర్వహించిన ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రీరిలీజ్‌ వేడుకను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. ‘సెల్ఫీ నెం:1 ఇది. ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన మెగాస్టార్‌ చిరంజీవి సర్‌కు ధన్యవాదాలు. ప్రియమైన మహేశ్‌.. మీరు నామీద ఉంచిన నమ్మకానికి, ప్రేమాభిమానాలకు థాంక్యూ. అలాగే మా వేడుకను మరింత జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు’ అని దేవిశ్రీ పేర్కొన్నారు.

మహేశ్‌ కథానాయుకుడిగా నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రానికి అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించారు. దేవిశ్రీ స్వరాలు అందించారు. దిల్‌రాజు, మహేశ్‌బాబు, అనిల్‌ సుంకర నిర్మాతలుగా వ్యవహించారు. సంక్రాంతి కానుకగా జనవరి 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని