ఇందులో రాజకీయ కోణం లేదు: మంచు లక్ష్మి
close
Published : 06/01/2020 20:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇందులో రాజకీయ కోణం లేదు: మంచు లక్ష్మి

హైదరాబాద్‌: దక్షిణాదికి చెందిన నటీనటులుగానే భారత ప్రధాని నరేంద్ర మోదీని కలిశామని నటి మంచు లక్ష్మి స్పష్టం చేశారు. ఆమెతోపాటు మోహన్‌బాబు, విష్ణు దంపతులు సోమవారం మోదీని కలిశారు. దాదాపు 45 నిమిషాలపాటు వీరి భేటీ కొనసాగింది. ఈ నేపథ్యంలో మోహన్‌బాబు భాజపాలో చేరే అవకాశాలు ఉన్నాయని వదంతులు వచ్చాయి. వాటిపై మంచు లక్ష్మి స్పందించారు.

మోదీని కలిసిన కారణంపై రకరకాల వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయని, ఇందులో ఏ రాజకీయ కోణం లేదని తెలిపారు. ఇటీవల బాలీవుడ్ ప్రముఖులు మోదీని కలిసిన విషయం తెలిసిందే. ఇప్పుడు దక్షిణాదికి చెందిన సినీ ప్రముఖులతో కూడా సమావేశం కావాలని మంచు లక్ష్మి కోరారట. ఈ మేరకు ప్రధాని నుంచి మాట కూడా తీసుకున్నారు. ఆమె దక్షిణాది స్టార్స్‌ అందరినీ రాష్ట్రపతి భవన్‌కి తీసుకెళ్లి, మోదీతో సమావేశం ఏర్పాటు చేయబోతున్నారట. ఈ బాధ్యతల్ని ఆమె చూసుకోబోతున్నారు. దక్షిణాది సినిమా భారత చిత్ర పరిశ్రమపై బలమైన ముద్ర వేసుకున్న తరుణంలో ఈ సమావేశం కొత్త ఉత్సాహాన్ని నింపుతుందని అందరూ భావిస్తున్నారు.

దక్షిణాది సినీ ఆర్టిస్టులతో ఆత్మీయ సమావేశం కోసం మోదీని కోరానని, ఆయన వెంటనే అంగీరించారని మంచు విష్ణు ట్వీట్‌ చేశారు. త్వరలో అందరూ మోదీని కలుస్తామని వెల్లడించారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని