‘ఈగ’ విలన్‌కు సల్మాన్‌ ఖరీదైన కానుక..!
close
Published : 07/01/2020 19:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘ఈగ’ విలన్‌కు సల్మాన్‌ ఖరీదైన కానుక..!

ఫొటో షేర్‌ చేసిన సుదీప్‌

ముంబయి: సల్లూభాయ్‌ సల్మాన్‌ ఖాన్‌ మంచితనం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అవసరాల్లో ఉన్న వారికి సహాయం చేసే ఆయన.. సహ నటుల్ని ప్రోత్సహిస్తూ కానుకలు కూడా ఇస్తుంటారు. ఇటీవల సల్మాన్‌ నటించిన ‘దబాంగ్‌ 3’ విడుదలై, హిట్‌ అందుకుంది. ప్రభుదేవా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సుదీప్‌ ప్రతినాయకుడిగా నటించారు. ఈ సినిమా షూటింగ్‌ సమయంలో సల్మాన్‌, సుదీప్‌ మంచి స్నేహితులయ్యారు. మరోపక్క ‘దబాంగ్‌ 3’ బాక్సాఫీసు వద్ద రూ.200 కోట్లకుపైగా వసూలు చేసింది.

ఈ నేపథ్యంలో సల్మాన్‌ ‘ఈగ’ విలన్‌కు బహుమతి ఇచ్చారు. సుదీప్‌ ఇంటికి వెళ్లి సర్‌ప్రైజ్‌ చేసి, ఖరీదైన కారును ఇచ్చారు. ఈ సందర్భంగా సుదీప్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో భాయ్‌కు ధన్యవాదాలు చెప్పారు. ‘మీరు మంచి చేస్తే మీకూ మంచే జరుగుతుంది. ఇది నిజమని నమ్మేలా సల్మాన్‌ సర్‌ చేశారు. మా ఇంటికి ఆయనతోపాటు బీఎమ్‌డబ్ల్యూ ఎమ్‌5ను తీసుకొచ్చి సర్‌ప్రైజ్‌ చేశారు. నాపై, నా కుటుంబంపై మీరు చూపుతున్న ప్రేమకు ధన్యవాదాలు. మీతో కలిసి పనిచేయడం, మీరు మా కోసం రావడం సంతోషంగా ఉంది’ అని పోస్ట్‌ చేశారు. ఇప్పటికే సల్మాన్‌.. సుదీప్‌కు ఓ జాకెట్‌ను కానుకగా ఇచ్చారు. తనకు ఇష్టమైన కుక్క ఫొటోను జాకెట్‌పై డిజైన్‌ చేయించి మరీ ఇచ్చారు. ఈ విషయాన్ని సుదీప్‌ ఇటీవల తెలిపారు. ఇన్‌స్టాలో ఫొటోను షేర్‌ చేశారు. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని