మెగాస్టార్‌ ప్రశంస.. విజయశాంతి స్పందన
close
Updated : 08/01/2020 14:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మెగాస్టార్‌ ప్రశంస.. విజయశాంతి స్పందన

సోషల్‌మీడియా వేదికగా నటి స్పెషల్ పోస్ట్‌

హైదరాబాద్‌: మెగాస్టార్‌ చిరంజీవి-విజయశాంతి.. ఒకప్పుడు టాలీవుడ్‌లో వీరిద్దరిది హిట్‌ కాంబినేషన్‌. వీరిద్దరు కలిసి సుమారు 20 సినిమాల్లో నటించి ఎందరో ప్రేక్షకులను ఫిదా చేశారు. రాజకీయాల్లో ప్రవేశించిన వీరిద్దరు కొంతకాలంపాటు సినిమాలకు దూరమైన విషయం తెలిసిందే. తాజాగా విజయశాంతి.. మహేశ్‌ బాబు కథానాయకుడిగా తెరకెక్కిన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో నటించారు. అయితే ఇటీవల జరిగిన ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రీరిలీజ్‌ వేడుకలో చాలా సంవత్సరాల తర్వాత చిరంజీవి, విజయశాంతి కలిసి ఒకే వేదికను పంచుకున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. ‘విజయశాంతి ఓ లేడీ సూపర్‌స్టార్‌, లేడీ అమితాబ్‌’ అని ప్రశంసించారు.

చిరంజీవి ప్రశంసలపై స్పందించిన విజయశాంతి సోషల్‌మీడియా వేదికగా స్పెషల్‌ పోస్ట్‌ పెట్టారు. లేడీ సూపర్‌స్టార్, లేడీ అమితాబ్ అని చిరంజీవి ప్రశంసించడంతో ఆ పదాలకు ఒక విలువ, పదింతల మర్యాద లభించినట్లు భావిస్తున్నానని ఆమె పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని కల్పించిన అనిల్‌ రావిపూడి, మహేశ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

‘నటనా పరమైన ప్రశంసల వల్ల లభించే సంతోషం ఒకటైతే.. కమర్షియల్ సినిమాల విజయంతో సాధించే స్టార్‌డమ్‌ ఇమేజ్ వల్ల అందుకునే ఆనందం ఇంకొకటి. ఈ రెండూ కళాకారులను అత్యంత ప్రభావితం చేయగలిగే అంశాలన్నది నా అభిప్రాయం. జాతీయ ఉత్తమ నటిగా నేను అవార్డు తీసుకున్న సందర్భంలో ఎంత గౌరవంగా భావించానో.. నటనకు డిక్షనరీ లాంటి మహానటుడు శివాజీ గణేషన్ గారు నన్ను ‘గ్రేట్ ఆర్టిస్ట్, నా దత్తపుత్రిక’ అని సంబోధించినప్పుడు అంతకుమించి గౌరవంగా భావించాను. అలాగే కమర్షియల్ సినిమాల పరంగా ఎన్ని విజయాలు సాధించినా.. లేడీ సూపర్‌స్టార్, లేడీ అమితాబ్ లాంటి అభినందనలు పొందినా.. ఆ మాటను తెలుగు సినిమాను కమర్షియల్‌ పరంగా, కలెక్షన్ల పరంగా అత్యున్నత స్థాయికి తీసుకెళ్లిన మెగాస్టార్ చిరంజీవి గారు చెప్పడంతో ఆ పదాలకు ఒక విలువ, పదింతల మర్యాద లభించినట్లుగా భావిస్తున్నాను. సాధారణంగా సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇలాంటి ప్రశంసలు అందుకోవడం ఆనవాయితీ. కానీ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లోనే మెగాస్టార్ నుంచి నేను అభినందనలు అందుకోవడానికి అవకాశం కల్పించిన సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి కృతజ్ఞతలు. ‘సరిలేరు నీకెవ్వరు’ దర్శకుడు రావిపూడి గారితో పాటు... మొత్తం చిత్ర యూనిట్‌కు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.’ అని విజయశాంతి పేర్కొన్నారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని