సినిమా హిట్‌.. దర్శకుడికిరేంజ్‌ రోవర్‌!
close
Published : 08/01/2020 18:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సినిమా హిట్‌.. దర్శకుడికిరేంజ్‌ రోవర్‌!

పండగ చేసుకుంటోన్న మారుతి

హైదరాబాద్‌: యువ కథానాయకుడు సాయిధరమ్‌ తేజ్‌ నటించిన ‘ప్రతిరోజు పండగే’ సినిమా మంచి టాక్‌ అందుకోవడంతోపాటు బాక్సాఫీసు వద్ద చక్కటి వసూళ్లతో రాణిస్తోంది. ఈ సినిమా 17 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.32.29 కోట్లు వసూలు చేసినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. అమెరికాలోని 26 లొకేషన్లలో సినిమా 656,380 డాలర్లు రాబట్టినట్లు అంచనా వేశారు. అంతేకాదు ఈ చిత్రం సాయిధరమ్‌ కెరీర్‌లోనే తొలివారంలో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా రికార్డు సృష్టించింది. ఈ సందర్భంగా జీఏ2 పిక్చర్స్‌ నిర్మాత బన్నీ వాస్‌ సినిమా విజయం గురించి ఓ ఆంగ్లపత్రికతో మాట్లాడుతూ.. ‘సినిమాకు వచ్చిన స్పందన అద్భుతం. వారాంతం తర్వాత సాధారణంగా వసూళ్లు తగ్గుతాయి. కానీ ఈ సినిమా విషయంలో మాత్రం అలా జరగడం లేదు. సాధారణ రోజుల్లోనూ గట్టి వసూళ్లు సాధిస్తోంది’ అన్నారు.

ఈ ఆనందాన్ని సెలబ్రేట్‌ చేసుకుంటూ బ్లాక్‌బస్టర్‌ హిట్‌ ఇచ్చిన దర్శకుడు మారుతికి యూవీ క్రియేషన్స్‌ నిర్మాత వంశీ ఖరీదైన కారు బహుమతిగా ఇచ్చారు. దీంతో మారుతి సర్‌ప్రైజ్‌ అయ్యారు. ‘ధన్యవాదాలు వంశీ డార్లింగ్‌.. నీలాంటి స్నేహితుడు ఉంటే ప్రతిరోజూ పండగే..’ అని ట్వీట్‌ చేశారు. దీంతోపాటు కారును కానుకగా ఇస్తుండగా తీసుకున్న ఫొటోను షేర్‌ చేశారు. దీన్ని చూసిన హాస్యనటుడు బ్రహ్మాజీ సరదాగా రిప్లై ఇచ్చారు. ‘ఫొటోను చూస్తుంటే.. మీరు వంశీ గారికి బహుమతి ఇస్తున్నట్లు ఉంది’ అని నవ్వుతున్న ఎమోజీలు షేర్‌ చేశారు. జీఏ2 పిక్చర్స్‌, యూవీ క్రియేషన్స్‌ సంయుక్తంగా సినిమాను నిర్మించిన సంగతి తెలిసిందే.

 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని