‘జీవితానికి అర్థం చెప్పే ఓ జ్ఞాపకం’
close
Published : 08/01/2020 16:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘జీవితానికి అర్థం చెప్పే ఓ జ్ఞాపకం’

‘జాను’ టీజర్‌ ఎప్పుడంటే..

హైదరాబాద్‌: మీ మొత్తం జీవితాన్నికి అర్థం చెప్పే ఓ జ్ఞాపకం.. ఆ జ్ఞాపకం మీలో స్ఫూర్తిని నింపవచ్చు, అదే సమయంలో మిమ్మల్ని భావోద్వేగానికి గురిచేయవచ్చు అని అంటున్నారు టాలీవుడ్‌ అగ్రకథానాయిక సమంత అక్కినేని. ఆమె, శర్వానంద్‌ నటీనటులుగా తెరకెక్కుతోన్న చిత్రం ‘జాను’.  సి.ప్రేమ్‌కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. దిల్‌ రాజు నిర్మాత. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను చిత్రబృందం 6న విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా టీజర్‌ విడుదల తేదీని ప్రకటించింది. ఈ మేరకు 9న సాయంత్రం 5గంటలకు టీజర్‌ను విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది. ఇదిలా ఉండగా సమంత సైతం టీజర్‌ విడుదలను తెలియచేస్తూ.. ‘మీరు సిద్ధంగా ఉన్నారా..?  తమకు సంతోషాన్నిచ్చే ప్రదేశానికి వెళ్లాలనుకుంటున్నా వారికోసం.. మీ మొత్తం జీవితాన్నికి అర్థం చెప్పే ఓ జ్ఞాపకం.. ఆ జ్ఞాపకం మీలో స్ఫూర్తిని నింపవచ్చు, అదే సమయంలో అది మిమ్మల్ని భావోద్వేగానికి గురిచేయవచ్చు.’ అని సమంత పేర్కొన్నారు.

త్రిష, విజయ్‌ సేతుపతి నటీనటులుగా తెరకెక్కిన చిత్రం ‘96’. ఈ చిత్రానికి రీమేక్‌గా ‘జాను’ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. స్కూల్‌ డేస్‌లో ఉన్నప్పుడు ప్రేమలోపడిన త్రిష, విజయ్‌ సేతుపతి కొన్ని అనివార్య కారణాల వల్ల విడిపోతారు. ఆ తర్వాత వీరిద్దరు స్కూల్‌ రీయూనియన్‌లో కలుస్తారు. ఆసమయంలో వీరిద్దరు మధ్య జరిగిన సంఘటనలు, వీరి ప్రేమ విజయం సాధిస్తుందా? అనే కథాంశంతో తెరకెక్కిన ఓ ప్రేమకథా చిత్రమే ‘96’. 

మరోవైపు ఇటీవల జీ సినిమా అవార్డుల వేడుకలో ఉత్తమ నటిగా ‘సూపర్‌డీలక్స్‌’ చిత్రానికి గాను సమంత అవార్డును సొంతం చేసుకున్నారు. విజయ్‌ సేతుపతి చేతుల మీదుగా అవార్డును సొంతం చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని సమంత పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె ఇన్‌స్టా వేదికగా ఓ పోస్ట్‌ పెట్టారు. ‘మీకెంతో ఇష్టమైన నటుడి చేతుల మీదుగా అవార్డును సొంతం చేసుకున్నప్పుడు’ అని సమంత హర్షం వ్యక్తం చేశారు.  మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని