‘అల..వైకుంఠపురములో’ కాన్సర్ట్‌.. కేసు నమోదు
close
Published : 09/01/2020 12:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘అల..వైకుంఠపురములో’ కాన్సర్ట్‌.. కేసు నమోదు

హైదరాబాద్‌: నిబంధనలకు విరుద్ధంగా మ్యూజికల్‌ కాన్సర్ట్‌ను నిర్వహించారంటూ ‘అల..వైకుంఠపురములో..’ మ్యూజికల్‌ నైట్‌ నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. టాలీవుడ్‌ నటుడు అల్లుఅర్జున్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘అల..వైకుంఠపురములో..’. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బన్నీకి జంటగా పూజాహెగ్డే నటించారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జనవరి 6వ తేదీ సాయంత్రం యూసఫ్‌గూడలోని పోలీస్‌గ్రౌండ్స్‌లో సోమవారం సాయంత్రం ‘అల..వైకుంఠపురములో..’ మ్యూజికల్‌ కాన్సర్ట్‌ నిర్వహించారు. చాలా వేడుకగా సాగిన ఈ మ్యూజికల్‌ కాన్సర్ట్‌ నిబంధనలకు విరుద్ధంగా సాగిందని తెలియజేస్తూ జూబ్లీహిల్స్‌ పోలీసులు ‘అల..వైకుంఠపురములో..’ మ్యూజికల్‌ కాన్సర్ట్‌ నిర్వహకులపై కేసు నమోదు చేశారు.

ఈ విషయంపై జూబ్లీహిల్స్ సీఐ పి.బలవంతయ్య మాట్లాడుతూ.. ‘‘అల.. వైకుంఠపురములో..’ మ్యూజికల్ కాన్సర్ట్‌కు సంబంధించి ఈ నెల 2న హారిక, హాసిని క్రియేషన్ మేనేజర్ యఘ్నేశ్ పోలీసుల అనుమతి తీసుకున్నారు. 5 నుంచి 6 వేల మంది అభిమానులు ఈ వేడుకలకు హాజరవుతారని.. అందుకు సంబంధించి అనుమతి పాస్‌లు ఇస్తున్నట్లు పోలీసులకు తెలిపారు. వేడుక సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు జరుగుతుందని అందులో పేర్కొన్నారు. అయితే కార్యక్రమం నిబంధనలకు విరుద్ధంగా రాత్రి 11.30 గంటల వరకు కొనసాగింది. వీటికి తోడు పాస్‌లు 15వేలకు పైగా ఇవ్వడంతో వేడుక ప్రాంగణంలో తొక్కిసలాట చోటుచేసుకోవడంతో పాటు రహదారులు అన్ని పూర్తిగా ట్రాఫిక్ జామ్‌ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే నిర్వహకులు నిబంధనలు ఉల్లంఘించారంటూ జూబ్లీహిల్స్ ఎస్సై నవీన్ రెడ్డి కేసు నమోదు చేశారు. ఈ కార్యక్రమాన్ని చేపట్టిన శ్రేయస్ మీడియా సంస్థతో పాటు, ఆ సంస్థ ఎండీ శ్రీనివాస్‌పై, హారిక అండ్‌ హాసిని క్రియేషన్ మేనేజర్ యఘ్నేష్ పై కేసు నమోదైంది’ అని పేర్కొన్నారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని