ఇది అన్యాయం: కమల్‌హాసన్‌
close
Published : 10/01/2020 22:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇది అన్యాయం: కమల్‌హాసన్‌

జేఎన్‌యూ దాడిపై విశ్వనటుడు వ్యాఖ్య

చెన్నై: ఇటీవల ప్రతిష్ఠాత్మక జవహర్‌లాల్‌ విశ్వవిద్యాలయంలో జరిగిన ఘటనపై అటు రాజకీయ ప్రముఖులతో పాటు, ఇటు సినీరంగానికి చెందిన నటీనటులు కూడా స్పందిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ దాడి గురించి కమల్‌ హాసన్‌ స్పందించారు. కొంతకాలం క్రితం రాజకీయాల్లోకి వచ్చిన కమల్‌.. తాజాగా తమిళనాడు రాష్ట్ర అభివృద్ధి గురించి ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఆయన తమిళనాడు రాష్ట్ర అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని, అలాగే ప్రతి ఒక్కరూ కూడా తమ వంతు కృషి అందించాలని కోరారు.

అనంతరం ఆయన జేఎన్‌యూ దాడి గురించి మాట్లాడుతూ విద్యార్థులపై అలాంటి దాడులు జరగడం అన్యాయమని తెలిపారు. ‘ఇలాంటి దాడులు గురించి వింటుంటే చాలా బాధగా ఉంటుంది. విద్యార్థులపై ఇలాంటి దాడులు జరగడం భయానికి గురి చేస్తోంది. ఇది అన్యాయం. దీని గురించి నేనింకా చాలా మాట్లాడాలి. ఇప్పటికైనా పరిస్థితులు మారాలి. నియంతృత్వ భావాలు నశించాలి.’ అని కమల్‌ పేర్కొన్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని