‘రాములో రాములా’ షూటింగ్‌ సమయంలో..
close
Published : 11/01/2020 12:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘రాములో రాములా’ షూటింగ్‌ సమయంలో..

ఆరోజంతా రంగుల లోకంలో విహరించాను

హైదరాబాద్‌: ‘అర్జున్‌రెడ్డి’.. బాక్సాఫీస్‌ వద్ద సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిన టాలీవుడ్‌ చిత్రం. ఈ సినిమాతో విజయ్‌ దేవరకొండ ఎందరో అభిమానులను సొంతం చేసుకున్నారు. ఈ సినిమాలో విజయ్‌ దేవరకొండ స్నేహితుడిగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నటుడు రాహుల్‌ రామకృష్ణ. ‘అర్జున్‌ రెడ్డి’ తర్వాత రాహుల్‌.. సహాయ నటుడిగా పలు చిత్రాల్లో నటిస్తూనే హీరోగా కూడా సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన నటించిన చిత్రం ‘అల..వైకుంఠపురములో..’. స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కథానాయకుడిగా నటించిన సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వం వహించారు. ప్రముఖ నటి టబు ఈ చిత్రంలో కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో రాహుల్‌ సినిమా షూటింగ్‌ సమయంలో జరిగిన ఓ విషయం గురించి అభిమానులతో పంచుకున్నారు.

ఈ మేరకు ఆయన ట్విటర్‌ వేదికగా ఓ ట్వీట్‌ పెట్టారు. ‘అల..వైకుంఠపురములో..’ చిత్రంలో టబుతో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉందని రాహుల్‌ పేర్కొన్నారు. ‘‘రాములో రాములా’ పాటను చిత్రీకరిస్తున్న సమయంలో టబు గారు నా దగ్గరకు వచ్చారు. అనంతరం ఆమె నా చేయి పట్టుకుని.. ‘అర్జున్‌రెడ్డి’ చిత్రంలో నా  నటన ఎంతగానో నచ్చిందని మెచ్చుకున్నారు. అంతటి గొప్ప నటి నన్ను మెచ్చుకోవడంతో ఆరోజంతా రంగుల లోకంలో విహరించాను. అలాంటి గొప్ప నటితో ‘అల..వైకుంఠపురములో..’ నటించడం నా అదృష్టంగా భావిస్తున్నాను.’ అని రాహుల్‌ రామకృష్ణ పేర్కొన్నారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని