పాప కోసం  గంటపాటు ఏడ్చిన నయన్‌
close
Published : 11/01/2020 21:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పాప కోసం  గంటపాటు ఏడ్చిన నయన్‌

చెన్నై: లేడీ సూపర్‌స్టార్‌ నయనతార క్రిస్మస్‌ రోజున గంటపాటు ఏడుస్తూనే ఉన్నారట. ఈ ప్రపంచంలోనే తనకు ఇష్టమైన వ్యక్తి తన మేనకోడలు ఏంజెలీనా (అన్నయ్య కుమార్తె) అని నయన్‌ చెప్పారు. పాప తన అదృష్టమని, చిన్నారి పుట్టినప్పటి నుంచి కెరీర్‌ పరంగా తనకు మంచి ఆఫర్లు వస్తున్నాయని అన్నారు. గత ఏడాది క్రిస్మస్ నుంచి మేనకోడలితో కలిసి సమయం గడపలేకపోతున్నానని, తను దుబాయ్‌కి వెళ్లిపోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పాపను బాగా మిస్‌ అవుతున్న నయన్‌ ఇటీవల బాధను అదుపు చేసుకోలేకపోయారట. దాదాపు గంటసేపు ఏడుస్తూనే ఉన్నారని తెలిసింది. ఈ మేరకు పలు కోలీవుడ్ వెబ్‌సైట్లు వార్తలు రాశాయి.

రజనీకాంత్‌తో కలిసి నయన్‌ నటించిన ‘దర్బార్‌’ సినిమా జనవరి 9న ప్రేక్షకుల ముందుకొచ్చి విజయం అందుకుంది. ప్రస్తుతం ఆమె ‘నెట్రికన్‌’ సినిమాలో నటిస్తున్నారు. మరోపక్క ‘మూకుతి అమ్మన్’ సినిమాలోనూ ఆమె నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ 90 శాతం పూర్తయినట్లు దర్శకుడు ఆర్జే బాలాజీ ప్రకటించారు. దర్శకుడిగా ఇది ఆయన తొలి సినిమా.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని