కోట్లల్లో ఫాలోవర్స్‌.. లక్షల్లోకామెంట్స్‌..!
close
Published : 12/01/2020 09:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కోట్లల్లో ఫాలోవర్స్‌.. లక్షల్లోకామెంట్స్‌..!

బన్నీ సందడే వేరబ్బా..!

అందరూ మెచ్చే స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌కున్న ఫాలోయింగే వేరు. నిర్మాత అల్లు అరవింద్‌ కుమారుడిగా ఆయన  తెరంగేట్రం జరిగిండొచ్చు కానీ.. ఆ ఇమేజ్‌ అలాగే ఉండిపోలేదు. తనదైన నటన, స్టైల్‌తో కోట్లాది అభిమానుల్ని సంపాదించుకున్నారు. వారితో స్టైలిష్‌ బన్నీ అనిపించుకుంటున్నారు. సోషల్‌మీడియా ద్వారా బన్నీ ఫ్యాన్స్‌కు మరింత చేరువయ్యారు. తన వ్యక్తిగత, సినిమా విశేషాలను తరచూ షేర్‌ చేసుకుంటున్నారు. ఫ్యాన్స్‌ కూడా తెగ లైక్‌.. తెగ కామెంట్లు చేస్తుంటారు. బన్నీ కథానాయకుడిగా నటించిన ‘అల వైకుంఠపురములో..’ సినిమా ఆదివారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా ఆయన సామాజిక మాధ్యమం వైపు ఓ లుక్కేద్దాం..


ఫాలోవర్స్‌

ఫేస్‌బుక్‌: 1,29,21,374
ట్విటర్‌: 3.7 మిలియన్‌ ఫాలోవర్స్‌ ఉన్నారు. కానీ, ఆయన మాత్రం కేవలం భారత ప్రధాని నరేంద్ర మోదీని మాత్రమే ఫాలో అవుతున్నారు.
ఇన్‌స్టాగ్రామ్‌: 4.8 మిలియన్ల మంది అనుసరిస్తున్నారు. ఇప్పటి వరకు బన్నీ 342 పోస్ట్‌లు చేశారు. ఆయన ఇన్‌స్టాలో కేవలం ఒకే ఒకర్ని ఫాలో అవుతున్నారు. అది ఎవరో కాదు ఆయన అర్ధాంగి స్నేహారెడ్డిని.

న్నీ ఇన్‌స్టాను ముద్దుల కుమార్తె అర్హ ఫొటోతో ఆరంభించారు. నవంబరు 21, 2017 పాప మొదటి పుట్టినరోజు సందర్భంగా ఇన్‌స్టాను ప్రారంభించారు. ‘నా చిట్టి ఏంజెల్‌కు హ్యాపీ బర్త్‌డే. అప్పుడే ఏడాదైపోయిందంటే నమ్మలేకపోతున్నా’ అని కామెంట్‌ చేశారు. పాప మొదటి బర్త్‌డే సందర్భంగా బన్నీ కుటుంబం సింగపూర్‌ వెళ్లారు.

ఇంటికి అందం, వెలుగు ఆ ఇంటి మహిళలు. ఇదే విషయాన్ని బన్నీ కూడా ఫీల్‌ అయ్యారు. ‘నా జీవితంలోని స్వీట్‌హార్ట్స్‌. దీపావళి రాత్రులు..’ అంటూ తన తల్లి, భార్య, కుమార్తె తదితరులు ఉన్న ఫొటోను షేర్‌ చేశారు.

రామ్‌ చరణ్‌ ‘రంగస్థలం’ సమయంలో అల్లు అయాన్‌ సందడి చేశాడు. చిట్టిబాబు లుక్‌లో సిద్ధమై.. స్టెప్పులేశాడు. ఈ సందర్భంగా తీసిన ఫొటోను బన్నీ ఇన్‌స్టాలో షేర్‌ చేశారు. ‘‘రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడు.. చరణ్‌ మామకు పిచ్చ అభిమాని. ‘రంగస్థలం’ పాటలతో రోజూ నా చెవి మోగిపోతోంది. ఎంత సక్కగున్నావ్‌ బే’ అంటూ అప్పట్లో బన్నీ సరదాగా మాట్లాడారు.

‘నా తొలి సినిమా ‘గంగోత్రి’ వచ్చి 15 ఏళ్లు పూర్తయింది. నాతో అరంగేట్రం చేయించిన కె. రాఘవేంద్రరావు, అశ్వినిదత్‌, నాన్నకు ధన్యవాదాలు. ఇప్పటి వరకు నా ఈ ప్రయాణంలో భాగస్వాములైన వారికి కూడా కృతజ్ఞతలు’ అని గత ఏడాది మార్చిలో బన్నీ పోస్ట్‌ చేశారు.

న్నీ పుట్టినరోజును పురస్కరించుకుని ఫ్యాన్స్‌ ఎవరికి వారు పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించారు. దీన్ని ఉద్దేశిస్తూ బన్నీ గత ఏడాది మాట్లాడారు. ‘ఎన్నో కేకులు.. ఎన్నో కానుకలు.. టన్నుల్లో ఫాలోవర్స్‌.. వందల్లో గ్రీటింగ్స్‌.. వేలల్లో బర్త్‌డే విషెస్‌. అమితమైన ప్రేమ.. ఇది నా అదృష్టం, ఆశీర్వాదంగా భావిస్తున్నా’ అని ఆనందం వ్యక్తం చేశారు.

న్నీ, అను ఇమ్మాన్యుయెల్‌ కలిసి ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ కోసం పనిచేశారు. ఈ సినిమా షూటింగ్‌లో తీసుకున్న సెల్ఫీని బన్నీ షేర్‌ చేస్తూ.. ‘నా హీరోయిన్‌ అను అడిగిన మొదటి, చివరి కోరిక సెల్ఫీ తీయమని. సో స్వీట్‌. షూటింగ్‌ చివరి రోజు మేం దిగిన తొలి వ్యక్తిగత ఫొటో ఇది’ అని పేర్కొన్నారు.

నారోగ్యంతో బాధపడుతున్న ఓ వీరాభిమాని బన్నీని చూడటమే తన చివరి కోరికన్నారు. ఫ్యాన్స్‌ క్లబ్‌ ద్వారా ఈ విషయం తెలుసుకున్న ఆయన ఆయనే ప్రత్యేకంగా విశాఖ వెళ్లి.. అభిమానితో మాట్లాడి వచ్చారు. యుక్త వయసులోనే అతడి ఆరోగ్యం చెడిపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

న్నీ ఓ మంచి ప్రేమికుడే కాదు.. తండ్రి కూడా. ఇద్దరు పిల్లల్ని అలా నడిపిస్తూ తీసుకున్న ఫొటోని ఆయన ఇటీవల షేర్‌ చేశారు. ‘లవర్‌ ఆల్సో ఫాదర్‌ ఆల్సో. ప్రకృతి ప్రేమికుడు.. సంతోషమైన తండ్రి’ అని క్యాప్షన్‌ ఇచ్చారు.

స్నేహారెడ్డి లెహెంగాలో ఉన్న ఫొటోను ఓసారి బన్నీ పంచుకున్నారు. ‘ఓ మైగాడ్‌. ఇంత అందమైన అమ్మాయిని నేను పెళ్లి చేసుకున్నానంటే నమ్మలేకున్నా’ అని కామెంట్ చేశారు.

న సతీమణిపై ఉన్న ప్రేమను బన్నీ తరచూ నెటిజన్లకు తెలుపుతూ ఉంటారు. ప్రత్యేక సందర్భాల్లో ఆమెతో కలిసి దిగిన ఫొటోలను షేర్‌ చేస్తుంటారు. సెప్టెంబరు 29న స్నేహారెడ్డి పుట్టినరోజు సందర్భంగా... ‘హ్యాపీ బర్త్‌డే క్యూటీ’ అని పోస్ట్‌ చేశారు. ప్రతి ఏడాది ఆయన స్నేహారెడ్డికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెబుతూనే ఉంటారు. ఆమెతో దిగిన ఫొటోలను షేర్‌ చేస్తూనే ఉంటారు.

న తాతయ్య అల్లు రామలింగయ్య జయంతి సందర్భంగానూ బన్నీ ఆయన్ను గుర్తు చేసుకుంటుంటారు. ‘మా జీవితాలకి పునాది వేసిన వ్యక్తి. ఆయన అంకితభావం, త్యాగం ఇవాళ మమ్మల్ని ఈ స్థాయిలో ఉంచాయి. మిమ్మల్ని చాలా మిస్‌ అవుతున్నాం’ అని ఈ అక్టోబరులో బన్నీ పోస్ట్‌ చేశారు.

న్నీ ఇటీవల కొత్త ఇంటికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా స్నేహారెడ్డి పిల్లలు అల్లు అర్హ, అల్లు అయాన్‌తో కలిసి పూజలో పాల్గొన్న ఫొటోను ఆయన షేర్‌ చేశారు. ఈ ఫ్యామిలీ ఫొటోకు 5 లక్షలకుపైగా లైక్‌లు వచ్చాయి.

ల్లు అర్జున్‌ ఇప్పటికే అనేక సినిమాల సక్సెస్‌ పార్టీలను నిర్వహించారు. చిత్ర బృందాన్ని ఆహ్వానించి వారి కోసం ప్రత్యేకమైన ఏర్పాటు చేస్తుంటారు. ‘గీత గోవిందం’, ‘మహానటి’, ‘టాక్సీవాలా’ తదితర చిత్ర బృందాలకు విందు ఇచ్చారు. ఇటీవల వచ్చిన ‘సైరా నరసింహారెడ్డి’ చిత్ర బృందానికి కూడా ట్రీట్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా మెగా ఫ్యామిలీతో కలిసి దిగిన ఫొటోను ఆయన షేర్‌ చేశారు.

‘తాతయ్య పద్మశ్రీ అందుకుని పాలకొల్లు వచ్చినప్పుడు మేమంతా ఆయనకు స్వాగతం పలకడానికి వెళ్లాం. ఆయనది ఓ గొప్ప ప్రయాణం’ అని బాల్యాన్ని గుర్తు చేసుకుంటూ బన్నీ ఇటీవల తన తాతయ్యతో కలిసి దిగిన ఫొటోను షేర్‌ చేశారు. ఇందులో బన్నీతోపాటు అల్లు శిరీష్‌, రామ్‌ చరణ్‌, వరుణ్‌తేజ్‌, నిహారిక, సుస్మిత కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

సుకుమార్‌ తెరకెక్కించిన ‘ఆర్య 2’ సినిమా బన్నీకి చాలా ప్రత్యేకం. ఈ సినిమా గురించి ఇటీవల ఆయన ఓ పోస్ట్‌ చేశారు. ‘ఉప్పెనంత ఈ ప్రేమకు గుప్పెడంత గుండె ఏమిటో’ నిజంగా ఈ మాట నిజం. నా గుండెలో ఈ ప్రేమ అసలు సరిపోవడం లేదు. మీ అందరి ప్రేమకు ధన్యవాదాలు. నా ‘ఆర్య 2’ ప్రయాణంలో భాగమైన వారందరికీ ధన్యవాదాలు. ‘ఆర్య’, ‘ఆర్య 2’ సినిమాలు తీసిన సుకుమార్‌కు ఎన్నిసార్లు థాంక్స్‌ చెప్పినా సరిపోదు. ‘ఐ లవ్‌ యూ నా ఊపిరి ఆగిపోయినా.. ఐ లవ్‌ యూ నా ప్రాణం పోయినా..’’ అంటూ బన్నీ పోస్ట్‌ చేశారు.

‘సుక్కు జుట్టు రంగు మారింది, నా చర్మం మారింది. కానీ మా మధ్య ఉన్న ప్రేమ మాత్రం అలానే ఉంది. మేమిద్దరం కలిస్తే ఏర్పడే పిచ్చి కూడా అలానే ఉంది. త్వరలోనే మీకు దాన్ని చూపిస్తాం’ అంటూ ‘ఆర్య 2’ సమయంలో, ఇటీవల సుకుమార్‌తో కలిసి తీసుకున్న ఫొటోను బన్నీ షేర్‌ చేశారు.

నవరి 10న అల్లు అరవింద్‌ పుట్టినరోజు. ఈ నేపథ్యంలో బన్నీ తండ్రిని ఆప్యాయంగా హత్తుకుని ఉన్న ఫొటోను పంచుకుంటూ.. శుభాకాంక్షలు చెప్పారు. ‘పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్న.. నువ్వెప్పటికీ నా ఫేవరెట్‌వే’ అని పేర్కొన్నారు. తన పిల్లలు ముద్దుపెడుతున్న ఫొటోను కూడా బన్నీ షేర్‌ చేశారు. ‘నిజమైన ముద్దులోనే ఆనందం ఉంది’ అని క్యాప్షన్‌ ఇచ్చారు.

ల్లు అర్జున్‌కు ప్రధాని మోదీ అంటే ప్రత్యేకమైన అభిమానం. మోదీ ఇటీవల చెన్నై వెళ్లినప్పుడు అక్కడి సముద్ర తీరంలో ఉన్న ప్లాస్టిక్‌ చెత్తను ఏరుతూ కనిపించారు. ఈ వీడియోను బన్నీ షేర్‌ చేశారు. మోదీపై ఇంకా గౌరవం పెరిగిందని అన్నారు.

-ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని