రష్మిక డైట్‌ ప్లాన్‌ ఇదే..!
close
Published : 13/01/2020 10:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రష్మిక డైట్‌ ప్లాన్‌ ఇదే..!

కూరగాయలంటే అసహ్యం అంటోన్న మేడమ్‌

హైదరాబాద్‌: ఆకర్షించే అందంతో తక్కువ సమయంలోనే ఎక్కువ మంది అభిమానులను సొంతం చేసుకున్నారు కన్నడ నటి రష్మిక. ఆమె అందానికి, ఫిజిక్‌కు ఫ్లాటైన ఎందరో నెటిజన్లను.. ‘She Is Soo Cute, She Is Soo Sweet, She Is Soo Beautiful’ అని ప్రశంసిస్తుంటారు. ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో నటించి అభిమానులను ఆకట్టుకున్నారు. ‘నీకు అర్థమవుతోందా’ అంటూ చక్కని అభినయంతో ప్రేక్షకులను మెప్పించారు. తాజాగా రష్మిక ఓ ఆంగ్ల పత్రికతో సరదాగా ముచ్చటించారు. ఇందులో భాగంగా  తాను ప్రతిరోజూ పాటించే డైట్‌ ప్లాన్‌ గురించి పంచుకున్నారు.

‘ప్రతిరోజూ నిద్రలేవగానే మంచి నీళ్లు ఎక్కువగా తాగడానికి ప్రాధాన్యం ఇస్తాను. ఉదయాన్నే కనీసం ఒక లీటర్‌ మంచి నీళ్లు తాగుతాను. నా డైటీషియన్‌ యాపిల్‌ సిడెర్‌ వెనిగర్‌ వాడమని సలహా ఇచ్చారు. ఇటీవలే నేను వెజిటేరియన్‌గా మారాను. టమోటాలు, బంగాళదుంపలు, దోసకాయ, క్యాపికమ్స్‌ అంటే నాకు నచ్చవు. వీటితోపాటు ఇంకొన్ని కూరగాయాలను కూడా తినడానికి ఇష్టపడను. కొన్నిరోజుల క్రితం ఇటలీ వెళ్లినప్పుడు కూరగాయలు తినడం ఇష్టం లేక ప్రతిరోజూ ఐస్‌క్రీమ్స్‌ తిని ఆకలి తీర్చుకునేదాన్ని.’ అని రష్మిక తెలిపారు.

‘సాధారణంగా నేను దక్షిణాది ఆహారాన్ని తినడానికి ఇష్టపడతాను. అన్నం ఎక్కువగా తీసుకోడానికి ఇష్టపడను. దాల్చిన చెక్క, చిలకడదుంపలతో చేసిన ఫ్రైను డిన్నర్‌లో తీసుకుంటాను. ఎక్కువశాతం ఉదయం పూటే వర్కౌట్లు చేస్తాను. కాకపోతే ఇటీవల సినిమా షూటింగ్స్‌లో బిజీగా ఉండడం వల్ల సాయంత్రం పూట చేస్తున్నాను. వర్కౌట్లు పూర్తయ్యాక కోడిగుడ్డుతో చేసిన ఫుడ్‌ని తింటాను.’ అని రష్మిక పేర్కొన్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని