సంక్రాంతి తర్వాత ప్రమోషన్స్‌: అనుష్క
close
Published : 13/01/2020 12:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సంక్రాంతి తర్వాత ప్రమోషన్స్‌: అనుష్క

హైదరాబాద్‌: తన తల్లిదండ్రులతో కలిసి బెంగళూరులో సంక్రాంతి పండగను జరుపుకొంటానని అగ్ర కథానాయిక అనుష్క తెలిపారు. ‘భాగమతి’ తర్వాత ఆమె నటించిన ‘నిశ్శబ్దం’ సినిమా జనవరి 31న విడుదల కాబోతోంది. హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాను పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్‌ కార్పొరేషన్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మాధవన్‌, అంజలి, సుబ్బరాజు, షాలినీ పాండే, అవసరాల శ్రీనివాస్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా విడుదలకు ఇంకా 20 రోజుల మాత్రమే ఉంది. కానీ చిత్ర బృందం ఇప్పటి వరకు ప్రమోషన్‌ కార్యక్రమాల్ని ప్రారంభించలేదు. మరోపక్క కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల అనుష్క మీడియాకు డైరెక్ట్‌ ఇంటర్వ్యూ ఇవ్వడం లేదని వదంతులు వచ్చాయి.

కాగా సంక్రాంతి తర్వాత ప్రచారం ప్రారంభించబోతున్నట్లు అనుష్క చెప్పారు. ‘నిశ్శబ్దం’ సినిమా అప్‌డేట్‌ తెలుసుకోవడం కోసం స్వీటీ రెండు రోజుల క్రితం ఓ ప్రైవేట్‌ స్టూడియోకు వచ్చారు. ఈ క్రమంలో ఆమె మీడియా కంటపడ్డారు. ‘నిశ్శబ్దం’ ప్రమోషన్‌లో పాల్గొనరా? అని ప్రశ్నించగా.. ‘ఇంకా సమయం ఉంది. వచ్చే వారం నుంచి ప్రచారంలో పాల్గొంటాను’ అని అన్నారు. అనంతరం సంక్రాంతిని ఎలా జరుపుకోబోతున్నారు అని అడగగా.. ‘మా అమ్మానాన్నలతో కలిసి పండగను జరుపుకొంటా. అందుకే బెంగళూరుకు వెళ్తున్నా’ అని చెప్పారు.

 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని