సరిగ్గా 14 ఏళ్ల తర్వాత అదే రోజున: రామ్‌
close
Published : 13/01/2020 13:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సరిగ్గా 14 ఏళ్ల తర్వాత అదే రోజున: రామ్‌

హైదరాబాద్‌: తనదైన శైలిలో క్లాస్‌+మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించి టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు రామ్‌ పోతినేని. 2006లో విడుదలైన ‘దేవదాసు’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన రామ్‌ కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలను చూశారు. గతేడాది విడుదలైన ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ చిత్రంతో చాలారోజుల తర్వాత ఓ మాస్‌, కిర్రాక్‌ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు రామ్‌. పూరీ జగన్నాథ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ఛార్మి నిర్మాతగా వ్యవహరించారు. ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ చిత్రంతో రామ్‌లోని మాస్‌ యాంగిల్‌ను చూసిన అభిమానులు ‘ఇస్మార్ట్‌.. నువ్వు తురుమురా’ అంటూ సోషల్‌మీడియాలో ప్రశంసల వర్షం కురిపించారు.

ఇదిలా ఉండగా 2019లో మంచి ప్రశంసలు అందుకున్న చిత్రాలు, నటీనటులతోపాటు టెక్నీషియన్స్‌కు జీ సినిమా అవార్డులను తాజాగా అందించారు. ఇందులో భాగంగా నాలుగు విభాగాల్లో ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ సినిమాకు అవార్డులు వరించాయి. బెస్ట్‌ సెన్సేషల్‌ డైరెక్టర్‌గా పూరీ జగన్నాథ్‌, బెస్ట్‌ సెన్సేషనల్‌ యాక్టర్‌గా రామ్‌, బెస్ట్‌ ప్రొడ్యూసర్‌గా ఛార్మి, బెస్ట్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా మణిశర్మ అవార్డులను అందుకున్నారు. ఈ నేపథ్యంలో పూరీ, ఛార్మితో కలిసి దిగిన ఓ ఫొటోను ట్విటర్‌ వేదికగా షేర్‌ చేసిన రామ్‌ ఓ స్పెషల్‌ ట్వీట్‌ పెట్టారు. ‘నేను కథానాయకుడిగా నటించిన ‘దేవదాసు’ చిత్రం జనవరి 11న విడుదలయ్యింది. సరిగ్గా 14 సంవత్సరాల తర్వాత అదే రోజు నేను ఈ అవార్డును అందుకున్నాను. ఇప్పటివరకూ నా ప్రయాణం చాలా అద్భుతంగా సాగింది. కానీ ఇప్పుడే నా ప్రయాణం ప్రారంభమైనట్లు అనిపిస్తోంది. మీ ప్రేమాభిమానాలకు, సపోర్ట్‌కు ధన్యవాదాలు.’ అని రామ్‌ పేర్కొన్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని