మెగా హీరోలకు పవర్‌స్టార్‌ అభినందనలు
close
Published : 13/01/2020 22:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మెగా హీరోలకు పవర్‌స్టార్‌ అభినందనలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: మెగా హీరోలు అల్లుఅర్జున్‌, సాయిధరమ్‌ తేజ హీరోలుగా నటించిన చిత్రాలు ఇటీవల మంచి విజయాలు సాధించడంతో పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ సినిమా హీరోలతో పాటు డైరెక్టర్‌, ప్రొడ్యూసర్‌, సినిమా బృందాలకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో అల్లుఅర్జున్‌ హీరోగా ‘అలవైకుంఠపురములో’ సినిమా ఈ నెల 12న విడుదలై మంచి టాక్‌ తెచ్చుకుంది. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా విజయం సాధించడంతో ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్‌, తమన్‌, హరీశ్‌శంకర్‌ అల్లు అర్జున్‌ను అభినందించారు. తాజాగా పవర్‌స్టార్‌ సైతం సినిమా ప్రొడ్యూసర్‌కు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.

‘సుప్రీం’ హీరో సాయిధరమ్‌తేజ్‌ హీరోగా నటించిన చిత్రం ప్రతిరోజూ పండగే. డిసెంబర్‌ 20న విడుదలై తన కెరీర్‌లోనే అతిపెద్ద హిట్టుగా నిలిచింది. ఈ సినిమా చూసి ఇప్పటికే పలువురు టాలీవుడ్‌ హీరో రామ్‌చరణ్‌తేజ్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు ‘ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాల్సిన సినిమా.. ప్రతిరోజూ పండగే’ అంటూ పొగడ్తల్లో ముంచెత్తారు. తాజాగా.. సుప్రీం హీరోకు మేనమామ అయిన పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ కూడా సినిమా మంచి విజయాన్నందుకున్నందుకు సాయిధరమ్‌తేజ్‌కు, సినిమా దర్శకుడు మారుతికి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఇద్దరికీ ఫ్లవర్‌బొకేతో పాటు లెటర్లు పంపించారు. డియర్‌ సాయిధరమ్‌తేజ్‌ .. ప్రతిరోజూ పండగే సినిమా మంచి విజయాన్నందుకుంది. అభినందనలు.. విష్‌ యూ ఆల్‌ ది బెస్ట్‌ ఫర్‌ ఫ్యూచర్‌’ అని ఆ లెటర్‌లో పేర్కొన్నారు. అయితే, తాను ఎంతగానో అభిమానించే పవర్‌స్టార్‌ నుంచి వచ్చిన బహుమతి చూసిన సాయి ధరమ్‌తేజ్‌ ఉబ్బితబ్బిబ్బయ్యారు. వెంటనే తన సంతోషాన్ని ట్విటర్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ‘మీకు.. ప్రస్తుతం థాంక్యూ చెప్పడం చాలా చిన్నదవుతుంది. లవ్‌ యూ పవన్‌కల్యాణ్‌ మామా’ అంటూ ట్విటర్‌లో రాసుకొచ్చారు. మరోవైపు దర్శకులు మారుతి సైతం ‘థాంక్యూ పవన్‌కల్యాణ్‌ సర్‌.. మీ అభినందనలతో సినిమా విజయం మరింత పరిపూర్ణమైంది. ఇదే అసలైన పండగరోజు’ అని ట్విటర్‌ వేదికగా పవన్‌కల్యాణ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని