ఆ హీరోతో చరణ్‌ డ్యాన్స్‌.. రియాక్షన్‌ చూశారా
close
Published : 16/01/2020 06:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆ హీరోతో చరణ్‌ డ్యాన్స్‌.. రియాక్షన్‌ చూశారా

యూట్యూబ్‌ ట్రెండింగ్‌లో వీడియో

చెన్నై: టాలీవుడ్‌ స్టార్‌ హీరో రామ్‌ చరణ్‌ తమిళ స్టార్‌ శివ కార్తికేయన్‌తో కలిసి స్టెప్పులేశారు. ఇటీవల చెన్నైలో ‘బిహైండ్‌వుడ్స్‌ గోల్డ్‌ మెడల్‌’ అవార్డుల వేడుక జరిగింది. ఈ కార్యక్రమానికి ధనుష్‌, నయనతార, శివ కార్తికేయ, విజయ్‌ దేవరకొండ, రష్మిక, సాయిపల్లవి, వెట్రిమారన్‌, అర్జున్‌ విజయ్‌, యశ్‌ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ‘రంగస్థలం’ సినిమాకు గానూ ‘బిహైండ్‌వుడ్స్‌ గోల్డ్‌ మెడల్‌’ అవార్డు అందుకున్న చరణ్‌.. దాన్ని కొన్ని రోజుల క్రితం మరణించిన తన వీరాభిమాని నూర్‌ మహ్మద్‌కి అంకితం ఇచ్చారు.

అనంతరం వేదిక నుంచి కిందికి రావడానికి సిద్ధపడుతుండగా యాంకర్లు ఓ స్టెప్పు వేయమని చరణ్‌ను కోరారు. దీంతో శివ కార్తికేయతో కలిసి వేస్తానని చెర్రీ చెప్పారు. తన ఇద్దరు సోదరీమణులు ఆయనకు అభిమానులని తెలిపారు. శివ కార్తికేయ సినిమాలోని ఏ పాటనైనా ప్లే చేయమని అడిగారు. ఆయన కూడా వేదికపైకి రాగానే ఇద్దరు కలిసి చిందేశారు. వీరు స్టెప్పులు వేస్తుంటే అక్కడి వారంతా చప్పట్లు కొట్టారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం యూట్యూబ్‌ ట్రెండింగ్‌లో ఉంది.

 

 

 

 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని