సమంత ఉత్తమ నటి: శర్వానంద్‌
close
Published : 15/01/2020 21:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సమంత ఉత్తమ నటి: శర్వానంద్‌

హైదరాబాద్‌: నేటి నటీమణుల్లో సమంత ఉత్తమ నటని కథానాయకుడు శర్వానంద్‌ అభిప్రాయపడ్డారు. వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తోన్న సినిమా ‘జాను’. తమిళ హిట్‌ ‘96’కు తెలుగు రీమేక్‌గా రూపొందిస్తున్నారు. ప్రేమ్‌ కుమార్‌ దర్శకుడు. దిల్‌రాజు నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా టీజర్‌కు విశేషమైన స్పందన లభించింది. ఈ చిత్రం గురించి శర్వా ఓ ఆంగ్లపత్రికతో మాట్లాడారు. ‘ఇది ఓ అందమైన ప్రేమకథ. 1996 పాఠశాల బ్యాచ్‌కు చెందిన ఇద్దరి కథ. అప్పుడు విడిపోయిన వారు.. ఇరవై ఏళ్ల తర్వాత మళ్లీ కలుస్తారు. ఇందులో సమంత కథానాయికగా నటిస్తున్నారు. ఆమెతో నటన ఓ గొప్ప అనుభవం. ఇప్పటి వారిలో ఉత్తమ నటి ఆమె’ అని ఆయన అన్నారు.

అనంతరం శ్రీకరణ్‌ దర్శకత్వంలో నటించబోతున్న సినిమా గురించి చెబుతూ.. ‘రైతు బిడ్డ రైతు ఎందుకు అవ్వకూడదు? రైతని చెప్పుకుని మనం ఎందుకు గర్వపడలేకపోతున్నాం? ఇంజినీర్లు, డాక్టర్లకు ఇస్తున్న మర్యాద రైతుకి ఎందుకు ఇవ్వడం లేదు? ఈ సినిమాలో ఆ అంశాల్ని ప్రస్తావించబోతున్నాం. కచ్చితంగా మా చిత్రం అందర్నీ ఆలోచింపజేస్తుంది’ అని శర్వా పేర్కొన్నారు. 

 




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని