మహేశ్‌, కల్యాణ్‌రామ్‌ సేమ్‌ టు సేమ్‌
close
Published : 17/01/2020 13:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మహేశ్‌, కల్యాణ్‌రామ్‌ సేమ్‌ టు సేమ్‌

ఆ హీరోయిన్స్‌తో అప్పుడలా.. ఇప్పుడిలా..!!

ఇంటర్నెట్‌ డెస్క్‌: మహేశ్‌బాబు, కల్యాణ్‌ రామ్‌ బాలనటులుగా వెండితెరకు పరిచయమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ ఇద్దరూ సంక్రాంతి కానుకగా తమ సినిమాలు విడుదల చేసి తెలుగు ప్రేక్షకులకు వినోదం పంచుతున్నారు. వీళ్లిద్దరి విషయంలో ఓ ప్రత్యేకత ఉంది. అదేంటంటే.. విజయశాంతి కథానాయికగా వచ్చిన ‘కొడుకు దిద్దిన కాపురం’లో మహేష్‌ బాల నటుడిగా కనిపించి ఆకట్టుకున్నాడు. 1989 సెప్టెంబరు 21న ఈ చిత్రం విడుదలైంది. మళ్లీ ఇన్నేళ్లకు ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో వీరిద్దరు కలిసి పనిచేశారు. అంతేకాదు విజయశాంతికి ఇది రీఎంట్రీ సినిమా.

మరోవైపు సుహాసిని కథానాయికగా వచ్చిన ‘బాల గోపాలుడు’ చిత్రంలో మెరిశాడు కల్యాణ్‌రామ్‌. 1989 అక్టోబరు 13న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పుడు ‘ఎంత మంచివాడవురా’ సినిమాలో కల్యాణ్‌రామ్‌.. సుహాసినితో కలిసి పనిచేశారు. 30 ఏళ్ల తర్వాత ఈ ఇద్దరు కథానాయకులు ఆ నాయికలతోనే కలిసి నటించడం విశేషం. అప్పుడు బాల నటులుగా 22 రోజుల తేడాతో థియేటర్లలో సందడి చేసిన వారు ఇప్పుడు కథానాయకులుగా 4 రోజుల తేడాతో ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రావడం ఎంతో ప్రత్యేకం.

 మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని