రష్మిక ఇంటిపై ఐటీ దాడులు:తేలనిలెక్క!
close
Published : 17/01/2020 18:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రష్మిక ఇంటిపై ఐటీ దాడులు:తేలనిలెక్క!

బెంగళూరు: కథానాయిక రష్మిక నివాసం నుంచి ఐటీ అధికారులు రూ.25 లక్షల విలువజేసే ఆస్తి పత్రాలు, డబ్బును స్వాధీనం చేసుకున్నారు. గురువారం ఉదయం కర్ణాటకలోని కొడుగు జిల్లా విరాజ్‌పేటలోగల ఆమె నివాసంలో అధికారులు తనిఖీలు చేసిన సంగతి తెలిసిందే. ఉదయం 7.30 గంటల ప్రాంతంలో ఆమె నివాసానికి చేరుకున్న అధికారులు రష్మిక ఆదాయ లెక్కలను పరిశీలించారు. ఈ క్రమంలో లెక్క తేలని మొత్తం రూ.25 లక్షలు విలువజేసే ఆస్తి పత్రాలు, నగదును ఆదాయపన్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మొత్తానికి సంబంధించిన పూర్తి వివరాలను రష్మిక తండ్రి చూపించలేకపోయారు. అదేవిధంగా రష్మిక కుటుంబానికి చెందిన కల్యాణ మండపంలో కూడా అధికారులు తనిఖీలు నిర్వహించారు.

రష్మిక ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించినప్పుడు ఆమె నివాసంలో లేరు. కేవలం ఆమె తల్లిదండ్రులు మాత్రమే ఉన్నారు. రష్మిక అత్యధిక పారితోషికం తీసుకుంటున్నారని ఇటీవల వార్తలు వచ్చాయి. వీటిపై కొన్ని రోజుల క్రితం ఆమె స్పందిస్తూ.. ‘భారీ మొత్తం తీసుకుంటున్నానని అంటున్నారు. మరి ఆ మొత్తం ఎంతో నాకు తెలియడం లేదు. ఓ సినిమా పరాజయం పొందితే.. కేవలం నటుడి సినిమా ఫ్లాప్‌ అయ్యింది అనుకోరు. నటి సినిమా కూడా విజయం సాధించలేదనే అంటారు. ఇక్కడ డబ్బులతో పనికాదు.. ఆ సినిమా కోసం మనం ఎంత కష్టపడ్డామనేదే ముఖ్యం’ అని చెప్పారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని