త్రివిక్రమ్‌కు రామ్మోహన్‌నాయుడు కృతజ్ఞతలు
close
Published : 19/01/2020 13:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

త్రివిక్రమ్‌కు రామ్మోహన్‌నాయుడు కృతజ్ఞతలు

‘సిత్తరాల సిరపడు’ పాట గురించి.. 

హైదరాబాద్‌: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌కు తెదేపా నేత, శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌ నాయడు కృతజ్ఞతలు తెలిపారు. ‘అల..వైకుంఠపురములో..’ చిత్రంలో క్లైమాక్స్‌ ఫైట్‌కు శ్రీకాకుళం జానపద గేయం ‘సిత్తరాల సిరపడు’ అనే పాటను జోడించి సినీ ప్రియులకు అందించారు దర్శకుడు త్రివిక్రమ్‌. ఈ పాటకు థియేటర్లలో ప్రేక్షకుల నుంచి వస్తోన్న స్పందన చూసిన చిత్రబృందం ఇటీవల ‘సిత్తరాల సిరపడు’ పాట లిరికల్‌ వీడియోను సోషల్‌మీడియా వేదికగా విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఈ పాట గురించి రామ్మోహన్‌ నాయడు స్పందించారు. ఈ మేరకు ఆయన ట్విటర్‌ వేదికగా చిత్రబృందానికి కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్లు పెట్టారు.

‘అల..వైకుంఠపురములో..’ శ్రీకాకుళం జానపద గీతాల చరిత్రను దృష్టిలో ఉంచుకుని మా వాడుక భాషలో రాసిన ‘సిత్తరాల సిరపడు’ పాట విని చాలా ఆనందించాను. ఈ జిల్లా సంస్కృతి, సాహిత్యం తెలుగువాళ్లకి చెప్పిన దర్శకులు, రచయిత, గేయకర్తకు కృతజ్ఞతలు. పాటకు అనుగుణంగా స్టైలిష్‌గా ఫైట్‌ చేసిన అల్లు అర్జున్‌కు ధన్యవాదాలు. శ్రీకాకుళం యాసలో ఓ మంచి పాటను మాకిందించినందుకు సాకేత్‌, సూరన్నకు ధన్యవాదాలు. జానపదాన్ని గుర్తు చేసేవిధంగా మంచి లిరిక్స్‌ను అందించిన విజయ్‌కుమార్‌తోపాటు సిక్కోలు సంస్కృతిని సినిమాలో కీలకంగా చూపించినందుకు త్రివిక్రమ్‌గారికి ధన్యవాదాలు.’ అని రామ్మోహన్‌ పేర్కొన్నారు.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని