సరిలేరు.. సరికొత్త రికార్డులు..!
close
Published : 19/01/2020 14:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సరిలేరు.. సరికొత్త రికార్డులు..!

నాన్‌-బాహుబలి రికార్డు.. ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

హైదరాబాద్‌: సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా బాక్సాఫీసు వద్ద కొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఈ చిత్రం స్వదేశంలోనే కాకుండా విదేశాల్లోనూ విశేషమైన వసూళ్లు రాబడుతోంది. తొలి వారంలో ప్రపంచ వ్యాప్తంగా రూ.100 కోట్లకుపైగా రాబట్టి... నాన్‌-బాహుబలి రికార్డును సృష్టించిందని చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ రెండు రోజుల క్రితం ప్రకటించింది.

కాగా విడుదలైన ఎనిమిది రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.112.03 కోట్లు (షేర్‌) సాధించినట్లు సినీ విశ్లేషకులు తాజాగా పేర్కొన్నారు. నైజాంలో 29.8 కోట్లు, సీడెడ్‌లో రూ.13.25 కోట్లు, యూఏలో రూ.14.9 కోట్లు, గుంటూరులో రూ.8.51 కోట్లు, తూర్పుగోదావరిలో రూ.9.04 కోట్లు, పశ్చిమగోదావరిలో రూ.6.02 కోట్లు, కృష్ణలో రూ.7.34 కోట్లు, నెల్లూరులో రూ.3.32 కోట్ల షేర్‌ రాబట్టింది. కర్ణాటకలో రూ.7 కోట్లు, తమిళనాడులో రూ.1 కోటి, మిగిలిన ప్రాంతాల్లో రూ.1.5 కోట్లు సాధించిందని పేర్కొన్నారు.

2 మిలియన్‌ డాలర్ల క్లబ్‌.. 
అంతేకాదు ఈ చిత్రం అమెరికాలో రెండు మిలియన్‌ డాలర్ల క్లబ్‌లో చేరింది. మహేశ్‌ నటించిన మూడు సినిమాలు ఇప్పటి వరకు అమెరికాలో 2 మిలియన్‌ డాలర్ల క్లబ్‌లో చేరడం విశేషం. అక్కడ సినిమా రూ.7.85 కోట్లు (షేర్‌) సాధించింది.  
‘మహర్షి’ తర్వాత మహేశ్‌ ‘సరిలేరు నీకెవ్వరు’లో నటించారు. ఇందులో ఆయన మేజర్ అజయ్‌ కృష్ణ పాత్రలో సందడి చేశారు. విజయశాంతి 13 ఏళ్ల విరామం తర్వాత ఇందులో నటించారు. అనిల్‌ రావిపూడి దర్శకుడు. దేవిశ్రీ ప్రసాద్‌ బాణీలు అందించారు. రష్మిక కథానాయిక. జనవరి 11న సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకుల ఆదరణ లభించింది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని