ఐటీ తనిఖీలు జరిగింది రష్మిక తండ్రి ఆస్తిపై..!
close
Published : 20/01/2020 21:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఐటీ తనిఖీలు జరిగింది రష్మిక తండ్రి ఆస్తిపై..!

వెల్లడించిన నటి మేనేజర్‌

బెంగళూరు: ఐటీ శాఖ అధికారులు తనిఖీలు జరిపింది కథానాయిక రష్మిక ఆదాయంపై కాదని, ఆమె తండ్రి మదన్‌ ఆస్తిపై అని నటి మేనేజర్‌ స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ఆయన తాజాగా ఓ ఆంగ్ల మీడియాకు తెలిపారు. కొన్ని రోజుల క్రితం కర్ణాటకలోని రష్మిక స్వస్థలం విరాజ్‌పేట్‌లోని నివాసంలో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో లెక్కతేలని రూ.25 లక్షల సొమ్ము, ఆస్తి పత్రాల్ని స్వాధీనం చేసుకున్నారు. ఆపై రష్మికకు ఆదాయ పన్నుశాఖ నోటీసులు పంపినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఈ నెల 21న బెంగళూరు, మైసూరు కార్యాలయాల్లో హాజరై వీటి వివరాలు అందించాలని రష్మికకు నోటీసులు జారీ చేశారట.

అయితే దీనిపై రష్మిక నేరుగా మీడియాతో మాట్లాడలేదు. ఐటీ అధికారులు తనిఖీలు జరిపింది నిజమేనని ఆమె తల్లి సుమన్‌ తెలిపారు. ‘గురువారం (తనిఖీలు జరిగిన రోజు) నుంచి మేం ఐటీ అధికారులకు సహకరిస్తున్నాం. మమ్మల్ని అధికారులు కొన్ని ప్రశ్నలు అడిగారు, మేం సమాధానాలు చెప్పాం’ అని పేర్కొన్నారు. ఈ క్రమంలో రష్మిక మేనేజర్‌ తాజాగా స్పందిస్తూ.. ఐటీ అధికారుల తనిఖీలు పూర్తిగా ఆమె తండ్రి ఆస్తికి సంబంధించిందని వెల్లడించారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని