గత రాత్రి కోసం కలకన్నా..: రేణూ దేశాయ్‌
close
Published : 20/01/2020 21:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

గత రాత్రి కోసం కలకన్నా..: రేణూ దేశాయ్‌

హైదరాబాద్‌: రైతుల జీవితాలు, వారి సమస్యలపై సినిమా తీయడానికి నటి, దర్శకురాలు రేణూ దేశాయ్‌ సన్నాహాలు చేస్తున్నారు. దీనికి ‘అన్నదాత సుఖీభవ’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ ప్రాజెక్టు కోసం పల్లెటూర్లకు వెళ్లి.. అక్కడి వాతావరణం, ప్రజల జీవన విధానం తెలుసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆమె తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ చేశారు. పల్లెటూరిలో తీసుకున్న ఫొటోలు, వీడియోను షేర్‌ చేశారు. గత రాత్రి గడిపిన తీరు ఎంతో నచ్చిందని పేర్కొన్నారు.

‘గత రాత్రి కోసం కల కన్నా.. అది ఎట్టకేలకు నిజమైంది. మనసారా కోరుకున్నా కాబట్టి నెరవేరింది. మా సినిమా కోసం మేం పరిశీలించిన గ్రామాల్లో చివరిది ఇది. మా కారు ఈ గ్రామంలోకి ప్రవేశించగానే.. ఇప్పుడే నాకు హైదరాబాద్‌కు రావాలని లేదని నా ప్రొడక్షన్‌ డిజైనర్‌కు చెప్పా. నేను ఆ మాట చెప్పిన మరు నిమిషం కారు టైరు పంక్చర్‌ అయ్యింది, నా కోరిక నిజమైంది. ఆ గ్రామ ప్రజలతో అద్భుతమైన సమయం గడిపా. వారికి సరైన తిండి లేదు.. కానీ అందులోంచి మాకు తినమని పంచే గొప్ప హృదయం వారిది. ఉప్మా, టీ పెట్టారు. సాధారణంగా మన దగ్గర డబ్బులున్నా ఇతరులకు ఇవ్వడానికి చాలా ఆలోచిస్తాం. కానీ వారికి ఏమీ లేకపోయినా.. ఉన్నది పంచారు. వారి నుంచి ఎంతో నేర్చుకోవచ్చు. ఈ సినిమా నా వ్యక్తిత్వాన్ని మార్చింది’ అని ఆమె పోస్ట్‌ చేశారు.

 

 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని