పవన్‌ కోసం ప్రత్యేక విమానం!..
close
Published : 23/01/2020 21:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పవన్‌ కోసం ప్రత్యేక విమానం!..

హైదరాబాద్‌: పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత దాదాపు సినిమాలకు గుడ్‌బై చెప్పినట్లేనని అంతా భావించారు. అయితే, చాన్నాళ్ల తర్వాత మేకప్‌ వేసుకున్న పవన్‌ ఇప్పటికే సినిమా షూటింగ్‌లో పాల్గొన్నాడు. హిందీలో బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ ప్రధాన పాత్రలో నటించిన ‘పింక్‌’ చిత్రాన్ని తెలుగులో రిమేక్‌ చేస్తున్నారు. వేణుశ్రీరామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పవన్‌కల్యాణ్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.  దిల్‌రాజు, బోనీ కపూర్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నివేధా థామస్‌, అంజలి, అనన్య కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ఇదిలా ఉండగా.. ఈ సినిమాకు సంబంధించి రోజుకో కొత్త వార్త వినిపిస్తోంది. రాజకీయాల్లో బిజీగా ఉన్న జనసేనాని ఈ సినిమా కోసం కేవలం 30 రోజుల కాల్‌ షీట్లు మాత్రమే ఇచ్చినట్లు సమాచారం. హైదరాబాద్‌ పరిసరాల్లో ప్రతిరోజూ షూటింగ్‌ ఉంటున్న నేపథ్యంలో సమయాభావాన్ని తగ్గించేందుకు పవన్‌ కల్యాణ్‌కు ఆ సినిమా నిర్మాత దిల్‌రాజు ప్రత్యేక విమాన సదుపాయం కల్పించారని సమాచారం. ఇప్పటికే ఓ విమానయాన సంస్థతో ఒప్పందం కూడా చేసుకున్నట్లు తెలుస్తోంది. అందుకోసం దిల్‌రాజు దాదాపు రూ.కోటి ఖర్చు చేయనున్నారని సినీవర్గాల ద్వారా వినిపిస్తోంది. కాగా.. ఈ సినిమా షూటింగ్‌లో పవర్‌స్టార్‌ పాల్గొన్న కొన్ని ఫొటోలు బయటికి లీక్‌ అవడంతో పవర్‌స్టార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారని, సినిమాకు సంబంధించిన ఎలాంటి సమాచారం బయటికి తెలియకుండా గోప్యంగా ఉంచాలని నిర్మాణ సంస్థకు ఆయన సూచించినట్లు సమాచారం.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని