‘ఇండియన్‌ 2’పై పెరుగుతున్న ఆసక్తి
close
Updated : 24/01/2020 17:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘ఇండియన్‌ 2’పై పెరుగుతున్న ఆసక్తి

కోడంబాక్కం, న్యూస్‌టుడే: శంకర్‌ దర్శకత్వంలో కమల్‌హాసన్‌ నటిస్తున్న సీక్వెల్‌ చిత్రం ‘ఇండియన్‌ 2’. మధ్యప్రదేశ్‌లో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. గ్వాలియర్‌ వంటి పలు ప్రాంతాల్లో ఇటీవల కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు. తదుపరి షెడ్యూల్‌ ఫిబ్రవరిలో చెన్నైలో ఉంటుందని కోలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. అవినీతి, లంచగొండితనానికి వ్యతిరేకంగా శంకర్‌ తెరకెక్కించిన ‘ఇండియన్‌’ (భారతీయుడు) ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకుంది. దానికి సీక్వెల్‌ కావడంతో ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇందులో కాజల్‌ కథానాయిక. లైకా ప్రొడక్షన్స్‌ బ్యానరుపై సుభాస్కరన్‌ నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీలో ఏకకాలంలో చిత్రీకరిస్తున్నారు. సిద్ధార్థ్, రకుల్‌ప్రీత్‌సింగ్, ప్రియా భవానిశంకర్, బాబిసింహా, సముద్రకని, వివేక్, తంబిరామయ్య, మనోబాలా, జగన్‌ వంటి భారీ తారాగణంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. రత్నవేలు సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ ఏడాది ఆఖరులోపు సినిమాను విడుదల చేయాలని చిత్రవర్గాలు భావించాయి. అయితే వచ్చే ఏడాది ఫిబ్రవరికి సినిమా వాయిదా పడిందని కోలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. ప్యాన్‌ ఇండియా చిత్రంగా ఉత్తరాది ప్రాంతాల ప్రేక్షకులు కూడా అన్వయించుకొనేవిధంగా దీనిని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని