రూటు మార్చిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’..!
close
Published : 26/01/2020 14:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రూటు మార్చిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’..!

ట్రోలింగ్‌ మాత్రం ఆగలేదు

హైదరాబాద్‌: దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. టాలీవుడ్‌ అగ్రకథానాయకులు రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్‌, హలీవుడ్‌ తారలు సందడి చేయనున్నారు. అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌, కొమరంభీంగా ఎన్టీఆర్‌ కనిపించనున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా ప్రారంభమైన నాటి నుంచి అభిమానులు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ అప్‌డేట్స్‌ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గతేడాది విలేకర్ల సమావేశం తర్వాత నుంచి ప్రతి పండగకు చిత్రబృందం కేవలం శుభాకాంక్షలు తెలుపుతుంది. న్యూఇయర్‌కైనా చెర్రీ, తారక్‌లకు సంబంధించిన ఫస్ట్‌లుక్స్‌ వస్తాయని ఎదురుచూసిన అభిమానులకు నిరాశే ఎదురైంది. దీంతో అభిమానులు ఆన్‌లైన్‌లో విపరీతంగా ట్రోలింగ్‌ చేశారు.

ఈ నేపథ్యంలో తాజాగా గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రబృందం ఎలాంటి పోస్టర్‌ను విడుదల చేయలేదు. దానికి బదులు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సెట్‌లో రాజమౌళి పతాక ఆవిష్కరణ చేసిన ఫొటోలను పోస్ట్‌ చేస్తూ ప్రతి ఒక్కరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ‘ఆర్‌ఆర్‌ఆర్’ రూటు మార్చి సెట్‌లో జరిగిన సెలబ్రేషన్స్‌ ఫొటోలు పెట్టినప్పటికీ అందులో రామ్‌చరణ్‌, తారక్‌ కనిపించలేదు. దీంతో నెటిజన్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. హీరోలకు సంబంధించిన ఫొటోలు కూడా విడుదల చేయాలని కోరుతున్నారు. ఇదిలా ఉండగా మరోవైపు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రానికి లీకుల బెడద పట్టుకుంది. ఇటీవల తారక్‌కు సంబంధించిన ఫొటోలు లీక్‌ అయ్యాయి. అంతేకాకుండా ఎన్టీఆర్‌పై షాట్‌ చిత్రీకరిస్తున్న వీడియో సైతం ఆన్‌లైన్‌లో చక్కర్లు కొట్టింది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని