మంచు మనోజ్‌ మరో పెళ్లి చేసుకుంటున్నారా?
close
Published : 28/01/2020 14:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మంచు మనోజ్‌ మరో పెళ్లి చేసుకుంటున్నారా?

హైదరాబాద్‌: ‘డైలాగ్‌ కింగ్‌’ మోహన్‌బాబు తనయుడిగా వెండితెరకు పరిచయమైనా నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు మంచు మనోజ్. 2017లో ‘ఒక్కడు మిగిలాడు’ తర్వాత ఆయన మరో చిత్రం చేయలేదు. త్వరలోనే ఎంఎం ఆర్ట్స్‌ పతాకంపై సినిమాలు నిర్మించనున్నట్లు తెలిపారు. 

తాజాగా ట్విటర్‌లో స్పందిస్తూ, ‘అగ్నిగోళంలా మండేందుకు సిద్ధంగా ఉన్నా. కొద్ది వారాల్లోనే మీకు ఒక ఆసక్తికర విషయం చెప్పబోతున్నా. వేచి చూడండి’ అని ట్వీట్‌ చేయగా, వెంటనే ఓ అభిమాని మనోజ్‌ను ఆసక్తికర ప్రశ్న అడిగాడు. ‘ఏంటి.. ఇంకో పెళ్లి చేసుకోబోతున్నారా’ అని అడగ్గా, వెంటనే మనోజ్‌ స్పందిస్తూ ‘వామ్మో..’ అని సమాధానం ఇచ్చారు. 

ఇటీవలే మనోజ్‌ తన భార్య ప్రణీతరెడ్డి నుంచి విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే.  ‘నా వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాలకు సంబంధించిన కొన్ని విషయాలను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నేను నా భార్యతో విడాకులు తీసుకున్నాను. మా ఇద్దరి మధ్య ఉన్న బంధం ముగిసింది. మా ఇద్దరి మధ్య చాలా సందర్భాల్లో మనస్పర్థలు వచ్చిన నేపథ్యంలో మేము విడిపోవాలని నిర్ణయించుకున్నాం. విడిపోతున్నా ఒకరంటే ఒకరికి పూర్తి గౌరవం ఉంది. వ్యక్తిగత కారణాల వల్ల నేను గతకొంతకాలంగా సినిమాలపై దృష్టి సారించలేకపోయాను.  నా కుటుంబంతోపాటు స్నేహితులు, అభిమానులు నాకు ఎంతో సపోర్ట్‌గా నిలిచారు.  నాకు అండగా నిలిచిన ప్రతిఒక్కరికి నా కృతజ్ఞతలు. మళ్లీ నేను సినిమాల్లో నటించనున్నాను’ అని గత అక్టోబరులో మనోజ్‌ స్వయంగా పేర్కొన్న సంగతి తెలిసిందే. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని