రజనీకాంత్‌కు స్వల్పగాయాలు
close
Published : 28/01/2020 21:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రజనీకాంత్‌కు స్వల్పగాయాలు

సురక్షితంగా ఉన్నారని వెల్లడించిన సన్నిహిత వర్గాలు

బెంగళూరు: ప్రముఖ సినీనటుడు రజనీకాంత్‌కు స్వల్ప గాయాలయ్యాయి. డిస్కవరీ ఛానెల్లో ప్రసారమయ్యే ‘మ్యాన్‌ వర్సెస్‌ వైల్డ్’ టీవీ షో కోసం రజనీ, బ్రిటన్‌ సాహసవీరుడు బేర్‌గ్రిల్స్‌తో  బందీపూర్‌ అటవీ ప్రాంతంలో చిత్రీకరణ జరుపుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రజనీకాంత్‌కు చిన్నపాటి గాయాలైనట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. అయితే ఆయన సురక్షితంగా ఉన్నారని.. ప్రస్తుతం ఇంటికి చేరుకున్నారని రజనీ సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో రేపటి షూటింగ్‌కు అనుమతి నిరాకరించినట్లు అటవీ అధికారులు వెల్లడించారు.

ఇదీ చదవండి..

రజనీకాంత్‌తో బేర్‌ గ్రిల్స్‌ ‘మ్యాన్‌ వర్సెస్‌ వైల్డ్‌’మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని