మీ అమ్మ నన్ను తిడుతుంది: సమంత
close
Published : 29/01/2020 20:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మీ అమ్మ నన్ను తిడుతుంది: సమంత

ఇంటర్నెట్‌ డెస్క్‌: సమంత అక్కినేని.. పెళ్లైన తర్వాత కూడా అదే జోరుతో తనకు తగ్గట్లుగా కుటుంబ నేపథ్యమున్న పాత్రలు ఎంచుకొంటూ అభిమానులను మెప్పిస్తోంది. తాజాగా హీరో శర్వానంద్‌తో కలిసి ఆమె నటించిన ‘జానూ’ చిత్రానికి అంతే జోరుగా ప్రచారం చేస్తోంది. అయితే, ఆమెతో పాటు ఆమె సినిమాకు ఓ అభిమాని కూడి ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నాడు. తమ అభిమాన నటి సమంత నటిస్తున్న సినిమాకు ప్రచారం చేయాలనుకున్న ఓ అభిమాని వినూత్నంగా ఆలోచించాడు. ఏకంగా మూడు గంటల పాటు కూర్చొని ఒక పుస్తకంలో ఐ లవ్‌ యూ జాను.. అని రాశాడు. దానిని వీడియో తీసి ట్విటర్‌ ద్వారా సమంతకు చేరేలా పోస్ట్‌ చేశాడు. ఆ పోస్టులో.. ‘ఇది రాసేందుకు నాకు మూడు గంటలు పట్టింది. మా అమ్మ కూడా నన్ను తిట్టింది. అయినా వదలకుండా.. రాశాను’ అని పేర్కొన్నాడు. దీనిపై స్పందించిన సమంత ఆ అభిమానిని ఉద్దేశిస్తూ.. ‘మీ అభిమానానికి థాంక్స్‌.. కానీ మీరు చేసిన ఈ పనికి మీ అమ్మగారు నన్ను కచ్చితంగా తిడతారు’ అని ఫన్నీగా జవాబిచ్చింది. అయితే, తన పోస్టుకు సమంత స్పందించడంతో ఆ అభిమాని ఉబ్బితబ్బిబ్బయ్యాడు. 
కాగా.. తమిళంలో త్రిష, విజయ్‌సేతుపతి కలిసి నటించిన ‘96’ చిత్రాన్ని తెలుగులో రీమేక్‌ చేస్తున్నారు. ఇందులో సమంత, శర్వానంద్‌ కలిసి నటించారు. ఈ చిత్రం ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకొంది. తాజాగా టీజర్‌ను కూడా విడుదల చేసింది. టీజర్‌ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. ఈ సినిమాకు సి.ప్రేమ్‌కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని