దర్శకుడు జగన్‌కు అక్షయ్‌ ఆర్థిక సాయం
close
Updated : 31/01/2020 20:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దర్శకుడు జగన్‌కు అక్షయ్‌ ఆర్థిక సాయం

ముంబయి: బాలీవుడ్‌ స్టార్‌ హీరో అక్షయ్‌కుమార్‌.. దర్శకులతో పాటు తనతో సినిమాలు తీసిన వారితో ఎంత సన్నిహితంగా ఉంటారో అందరికీ తెలిసిందే. ఎవరికి ఏ అవసరం వచ్చినా సహాయం చేయడంలో అస్సలు వెనకడుగు వేయరు. ఇటీవల అస్వస్థతకు గురైన ఓ డైరెక్టర్‌కు వైద్య ఖర్చులు చెల్లిస్తూ మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. అక్షయ్‌కుమార్‌ హీరోగా జగన్‌శక్తి దర్శకత్వంలో ‘మిషన్‌మంగళ్‌’ సినిమా చేశారు. ఆ దర్శకుడు ఓ శుభకార్యంలో పాల్గొన్న సందర్భంగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయన మెదడులో రక్తం గడ్డ కట్టడంతో ప్రస్తుతం ముంబయిలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న అక్షయ్‌కుమార్‌.. చికిత్సకు కావాల్సిన ఖర్చులు భరిస్తున్నారు. అంతేకాదు బాధిత కుటుంబానికి నిత్యం అందుబాటులో ఉంటూ వారి బాగోగులు చూసుకోవాలని తన సిబ్బందికి సూచించారట. కాగా.. జగన్‌ ప్రస్తుతం కోలుకుంటున్నారని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిసింది.

ఇస్రో చేపట్టిన మిషన్ మంగళ్‌యాన్ ప్రయోగం ఆధారంగా మిషన్‌ మంగళ్‌ తెరకెక్కించారు. అక్షయ్‌కుమార్‌ హీరోగా 2019లో వచ్చిన ఈ చిత్రం భారీ హిట్టు కొట్టింది. ఈ సినిమాతోనే జగన్‌ దర్శకుడిగా బాలీవుడ్‌కు పరిచయమయ్యారు. కాగా.. ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద దాదాపు రూ.300కోట్లు రాబట్టింది. అక్షయ్‌కుమార్‌తో పాటు విద్యాబాలన్‌, సోనాక్షిసిన్హా, తాప్సీ. నిత్యా మేనన్‌ నటించారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని