‘సరిలేరు నీకెవ్వరు’పై కృష్ణ ఏమన్నారంటే?
close
Updated : 31/01/2020 14:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘సరిలేరు నీకెవ్వరు’పై కృష్ణ ఏమన్నారంటే?

ఆన్‌లైన్‌లో వీడియో చక్కర్లు

హైదరాబాద్‌: టాలీవుడ్‌ అగ్ర హీరో మహేశ్‌ బాబు నటించిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’ గురించి ఆయన తండ్రి సూపర్‌స్టార్‌ కృష్ణ స్పందించారు. సినిమా చాలా బాగుంది అంటూ ఆయన మాట్లాడిన వీడియోను చిత్ర నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ విడుదల చేసింది. ఈ వీడియో ప్రస్తుతం ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోంది. ‘‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం ఈ రోజు బ్లాక్‌బస్టర్‌ అయ్యింది. నిర్మాత, డైరెక్టర్‌ ఈ సినిమాని ‘బ్లాక్‌బస్టర్‌ కా బాప్‌’ అని పేర్కొంటూ పబ్లిసిటీ ఇవ్వడం చాలా బాగుంది. సినిమా అద్భుతంగా ఉంది. నా ఉద్దేశంలో ఈ సినిమాకు మరింత విజయం వరిస్తుంది. నిర్మాత ఎక్కడా కూడా డబ్బుల విషయంలో రాజీ పడలేదు. బోర్‌ కొట్టకుండా డైరెక్టర్‌ సినిమాని చక్కగా తెరకెక్కించారు’ అని కృష్ణ పేర్కొన్నారు. 

మేజర్‌ అజయ్‌ కృష్ణ పాత్రలో మహేశ్‌ మెప్పించిన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన నాటి నుంచి మంచి టాక్‌తో బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. దీంతో చిత్రబృందం సైతం ‘బాక్సాఫీస్‌ కా బాప్‌’ అని పేర్కొంటూ ప్రత్యేక పోస్టర్లను, ప్రచార చిత్రాలను విడుదల చేసింది. చాలా సంవత్సరాల తర్వాత మహేశ్‌లోని మాస్‌+కామెడీ యాంగిల్‌ను అనిల్‌ రావిపూడి చక్కగా చూపించారంటూ సినీ ప్రియులు, ప్రముఖులు నెట్టింట్లో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని