కేజీఎఫ్‌-2 వీడియో లీక్‌
close
Updated : 03/02/2020 14:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కేజీఎఫ్‌-2 వీడియో లీక్‌

ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్న వైనం

బెంగళూరు: అగ్రకథానాయకులు నటించే సినిమాలు నిర్మాణ దశలో ఉండగానే వాటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఆన్‌లైన్‌లో లీక్‌ అవుతుంటాయి. లీక్‌ల బారినపడకుండా ఉండేందుకు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఏదో విధంగా అవి బయటకు వస్తూనే ఉంటాయి. తాజాగా ‘కేజీఎఫ్‌: ఛాప్టర్‌2’ షూటింగ్‌ సెట్‌కు సంబంధించిన ఫొటోలు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. కన్నడ హీరో యశ్‌ కథానాయకుడిగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కేజీఎఫ్‌’ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న చిత్రం ‘కేజీఎఫ్‌ 2’.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. షూటింగ్‌లో భాగంగా మైసూర్‌లోని గ్లోబుల్‌ ఎడ్యూకేషన్‌ సెంటర్‌లో యశ్‌పై కొన్ని సీన్లు చిత్రీకరించారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు లీకయ్యాయి. ప్రస్తుతం ఇవి ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్నాయి. కేజీఎఫ్‌ చిత్రానికి ఉన్న క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని ‘కేజీఎఫ్‌: ఛాప్టర్‌2’ సినిమాని మరింత ప్రతిష్ఠాత్మకంగా  తెరకెక్కిస్తున్నామని ఇటీవల దర్శకుడు అన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో అధీర పాత్రలో బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్ కనిపించనున్నారు.

 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని