ఆమెది తొలి చూపు ప్రేమంట..!
close
Updated : 04/02/2020 17:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆమెది తొలి చూపు ప్రేమంట..!

ముంబయి: బాలీవుడ్‌లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న అందాల తార దిశా పటానీ తొలి చూపులోనే ప్రేమలో పడిందట. బాలీవుడ్‌ నటుడు టైగర్‌ ష్రాఫ్‌తో ప్రేమలో ఉన్నట్లు వస్తున్న వార్తలపై ఆమెను ప్రశ్నించగా ఇలా స్పందించింది. ఈ మధ్య పలుమార్లు కలిసి పార్టీలు, డిన్నర్లకు సైతం వెళ్లడంతో వీళ్లిద్దరూ డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలో స్పందించిన ఆమె ‘నేను తొలి చూపులోనే ప్రేమలో పడ్డాను. జీవితంలో ప్రేమ చాలా ముఖ్యమని భావిస్తున్నా. ప్రతి మనిషి జీవితంలో ప్రేమ అనేది ఒక భాగం. మనం ఏదైనా పని చేస్తున్నామంటే దానికి ఎవరి మీదో ఒకరి మీద ఉన్న ప్రేమే కారణం. ప్రేమ లేకుండా ఎవరూ జీవించలేరు’ అని పేర్కొంది. అయితే, ఆమె ప్రేమలో పడింది టైగర్‌ ష్రాఫ్‌తోనా లేక వేరేవారితోనా..? అనే విషయాన్ని స్పష్టం చేయలేదు.

బాలీవుడ్‌లో ఎం.ఎస్‌ ధోనీ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకుందీ సుందరి. ఆ తర్వాత వరుసగా సినిమా అవకాశాలు దక్కించుకుంది. తెలుగులో ‘లోఫర్‌’ సినిమాలో వరుణ్‌తేజ్‌కు జోడీగా నటించి కుర్రకారు హృదయాలు దోచుకుంది. ప్రస్తుతం బాలీవుడ్‌లో ‘మలంగ్‌’తో పాటు సల్మాన్‌ఖాన్‌ చిత్రం ‘రాధే’లో నటిస్తోంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని