వావ్‌: రవివర్మ సమంత పెయింటింగ్‌ వేస్తే..!
close
Updated : 04/02/2020 18:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వావ్‌: రవివర్మ సమంత పెయింటింగ్‌ వేస్తే..!

హైదరాబాద్‌: రవివర్మ గీసిన చిత్రాల అందాన్ని చూస్తే రాతి గుండెలోనైనా వసంతాలు వెల్లివిరుస్తాయి. అలాంటి అద్భుతమైన చిత్రాలు ఆయన కుంచె నుంచి జాలువారాయి. మరి రవివర్మే దిగి వచ్చి అందాల సమంత చిత్రం గీస్తే ఎలా ఉంటుంది. ఇదిగో ఇలాగే ఉంటుంది. అయితే, ఇది ఆయన గీసిన చిత్రం కాదండోయ్‌ ప్రముఖ ఫొటోగ్రాఫర్‌, విజువల్‌ ఆర్టిస్ట్‌ వెంకట్‌ రామ్‌ కెమెరా మాయజాలం. రవివర్మ గీసిన చిత్రాల మాదిరిగానే సమంతను ఫొటో షూట్‌ చేశారు. ఆయన గీసిన చిత్రాలు ఎప్పటికీ ఎవర్‌గ్రీన్‌ అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ, ఆ చిత్రరాజం రూపంలో సమంత, శ్రుతి హాసన్‌, ఐశ్వర్యా రాజేశ్‌లను చూస్తే అభిమానులు ఫిదా కావాల్సిందే. వీరితో పాటు, రమ్యకృష్ణ, ఖుష్భూ, మంచు లక్ష్మి చిత్రాలను కూడా వెంకట్‌ రామ్‌ పునః సృష్టించారు. కావాలంటే వాటిని మీరూ చూసేయండి. ప్రస్తుతం ఇవి సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా ట్రెండ్‌ అవుతున్నాయి.

ఇప్పుడెందుకు వీరంతా రవివర్మ పెయింటింగ్‌ చిత్రాల మాదిరిగా ఫొటోలు దిగారనుకుంటున్నారా? మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్న ‘నామ్‌’ అనే ఛారిటబుల్‌ ట్రస్ట్‌ 12మంది సెలబ్రిటీలతో ఒక క్యాలెండర్‌ను తయారు చేస్తోంది. సుహాసిని మణిరత్నం ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ ట్రస్ట్‌ కోసం సినీ తారలందరూ రవివర్మ చిత్రాలైపోయారు. ఆరోగ్యం, విద్య, ఆత్మరక్షణ సహా మహిళలను అన్ని రంగాల్లో తీర్చిదిద్దేందుకు ఈ ట్రస్ట్‌ కృషి చేస్తోంది.

ఐశ్వర్య రాజేశ్‌

రమ్యకృష్ణ

శ్రుతి హాసన్‌

మంచు లక్ష్మి

ఖుష్బూ

లీసా

నదియా

స్వాతిమరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని