సేవా కార్యక్రమాల వైపు అడుగులేయండి: బ్రహ్మానందం
close
Published : 04/02/2020 13:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సేవా కార్యక్రమాల వైపు అడుగులేయండి: బ్రహ్మానందం

కాకినాడ: ప్రజలు క్యాన్సర్‌ వ్యాధిపై అవగాహన పెంచుకోవాలని, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం అన్నారు. ప్రపంచ క్యాన్సర్‌ దినోత్సవం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో టీం ఆస్పత్రి ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది, విద్యార్థులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. కాకినాడ నాగమల్లితోట జంక్షన్‌ నుంచి జేఎన్‌టీయూ మీదుగా టీం ఆస్పత్రి వరకూ ఈ ర్యాలీ సాగింది. ఆస్పత్రి సిబ్బంది, విద్యార్థులు క్యాన్సర్‌పై అవగాహన కల్పిస్తూ.. వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు వివరించారు. ర్యాలీ అనంతరం ఆస్పత్రి ఆవరణలో జరిగిన సమావేశానికి ముఖ్య అతిథులుగా బ్రహ్మానందం, మంత్రి కన్నబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా బ్రహ్మానందం మాట్లాడుతూ.. క్యాన్సర్‌ వ్యాధి చాలా ప్రమాదకరమైన రోగం అన్నారు. మద్యం, ధూమపానం జోలికి వెళ్లకూడదని ప్రజలకు సూచించారు.పొగ తాగడం మన సంస్కృతి కాదని, మన దేశాన్ని బ్రిటిష్‌ వారు పాలించిన సమయంలో వారిని చూసి మనకు అది అలవాటయ్యిందని గుర్తు చేశారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి సేవా కార్యక్రమాలవైపు అడుగులు వేయాలని కోరారు.టీం ఆస్పత్రి ఛైర్మన్‌ వీర్రాజు పేదలకు చేస్తున్న సేవలను ఈ సందర్భంగా బ్రహ్మానందం కొనియాడారు. అనంతరం వైద్యులను శాలువాలతో సత్కరించారు. 


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని